SAKSHITHA NEWS

ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నాం…

37వ రోజు ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…

హారతులతో ఘన స్వాగతం పలికిన మహిళలు…

రంగారెడ్డి నగర్, పంచశీల కాలనీ, చెన్నారెడ్డి నగర్ లలో ఎమ్మెల్యే పాదయాత్ర…

ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నామని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అన్నారు. ఈ మేరకు 37వ రోజు ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా ఎమ్మెల్యే రంగారెడ్డి నగర్ 127 డివిజన్ లో పర్యటించారు. రంగారెడ్డి నగర్, పంచశీల కాలనీ, చెన్నారెడ్డి నగర్ లలో స్థానిక ప్రజలతో కలిసి ఎమ్మెల్యే పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులను పరిశీలించారు. రంగారెడ్డి నగర్ లో రూ.1.80 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు పూర్తి చేసినందుకు, బస్తీ దవాఖాన ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే గారికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. పంచశీల కాలనీలో రూ.1.53 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు పూర్తి చేసినందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు. చెన్నారెడ్డి నగర్ లో రూ.62 లక్షలతో వివిధ అభివృద్ధి పనులు పూర్తి చేసినందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మిగిలి ఉన్న పనులు తెలుసుకొని వాటిని త్వరలోనే పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. గతంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సౌకర్యం, రోడ్లు తదితర వసతులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళమని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారి కృషితో అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా కాలనీల రూపురేఖలు మారాయని ఆయా స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గారికి హారతులతో ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నామని అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే దిశగా పనిచేస్తున్నామన్నారు. గత పాలకుల హయాంలో అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలను అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే గారు చెప్పారు. గౌరవ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి సహకారంతో అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదన్నారు. జటిలమైన అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాబోయే రోజుల్లో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంను అన్ని రంగాల్లో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఏర్వ శంకరయ్య, మాజీ అధ్యక్షుడు గౌసుద్దిన్, డివిజన్ ప్రధాన కార్యదర్శి సుధాకర్, డిఈఈ భాను చందర్, మేనేజర్ పూజ, కాలనీల సంక్షేమ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, కాలనీ వాసులు జ్యోతి, కరుణ, ఆనంద్, రాజేష్, రవి, సంతోష్, శ్రీహరి, ఇబ్రహీం, గోపాల్ రెడ్డి, రహీం, రమణ రెడ్డి, నాగేందర్, నరేందర్, మూర్తి, జింకల వెంకటేష్, రాములు, కరుణాకర్ రెడ్డి, పరమేష్, అశోక్, భాగ్యమ్మ, మాధవరెడ్డి, పుష్ప, హఫీజ్, సుధాకర్, కిష్టయ్య, బీమయ్య మరియు నాయకులు ఓంకార్ రెడ్డి, క్రాంతి యాదవ్, బాలు నేత, అల్లావుద్దీన్, మేరీ, ఈష్వరి, తేజ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS