తిరుపతి అభివృద్ధిని రాష్ట్రంలో శిఖరాగ్రంలో నిలబెట్టగలిగాం..ఎమ్మెల్యే అభ్యర్థి డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి .
సాక్షిత : యస్ వి యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఉద్యోగులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది.
నగరాభివృద్ధిలో భాగంగా 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు, 7 ఫ్రీ లెఫ్ట్ రోడ్లు, 5 స్లిప్ వే రోడ్లు, నగర కూడళ్లను సుందరీకరించాం. నగరంలో ఎక్కడా ట్రాఫిక్ సమస్యలేకుండా శాశ్వత పరిష్కారం చూపగలిగాం. రానున్న రోజుల్లో మరో 14మాస్టర్ ప్లాన్ రోడ్లు నిర్మించడానికి ప్రణాళికలు రూపొందించాం.
మన పిల్లలు ఉన్నత చదువులు చదివి బయట నగరాలకు వలస వెళ్లాల్సి వస్తోంది. అందుకే యువత ఇక్కడే ఉపాధి పొందేలా తిరుపతికి ఐటీ కంపెనీలు తీసుకొచ్చేలా ప్రణాళికలు తయారుచేస్తున్నాం. భవిష్యత్తులో దేశంలోనే పరిశుభ్రమైన నెంబర్ వన్ నగరంగా తీర్చిదిద్దుతాను.
అలాగే నగరంలో చిన్న అవాంఛనీయ ఘటనలు జరగకుండా నేర రహిత నగరంగా తయారుచేస్తాం. ఇందులో భాగంగా 4000 సీసీ కెమెరాలు ప్రతి వీధిలో ఏర్పాటు చేయబోతున్నాం.
మన తిరుపతి అభివృద్ధి చెందాలని రాత్రి, పగలు అనే తేడా లేకుండా అహర్నిశలు శ్రమించాను, తిరుపతి అభివృద్ధి మీ కళ్ల ముందే కనబడుతోంది, భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చేస్తానని మాట ఇస్తున్నాను.
రానున్న ఎన్నికలలో మీ అందరి సహాయసహకారాలు అందించి మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి మన తిరుపతి అభివృద్ధికి భాగస్వాములు కావాలని అభ్యర్థిస్తున్నాను.