SAKSHITHA NEWS

వాటర్ ప్లాంట్ ను జిపి ద్వారా నిర్వహించాలి

సాక్షిత సిద్దిపేట జిల్లా

జగదేవపూర్ మండలం తిగుల్ గ్రామంలో ఉన్న వాటర్ ప్లాంట్ ను గ్రామ పంచాయతీ ద్వారా మరమ్మతులు చేయించి పంచాయతీ ద్వారానే ఫిల్టర్ వాటర్ అందించాలని కోరుతూ బిఆర్ఎస్ నాయకులు గ్రామపంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి ప్రవీణ్ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా గజ్వేల్( ఏఎంసి ) మాజీ వైస్ చైర్మన్ బట్టు సుధాకర్ రెడ్డి తిగుల్ పిఎసిఎస్ డైరెక్టర్ కామల్ల భూమయ్య, మాట్లాడుతూ గత 15 ఏళ్ల క్రితం చాగళ్ల నరేంద్ర ట్రస్టు ద్వారా గ్రామంలో వాటర్ ఫిల్టర్ ను ఏర్పాటు చేశారు. అప్పటినుండి గ్రామ పంచాయతీ సంబంధించిన భవనంలో ప్రభుత్వ బోరు మోటార్ సాయంతో విద్యుత్ బిల్లులు కూడా పంచాయతీ చెల్లిస్తూ దాని ద్వారా వచ్చిన ఆదాయం జిపిలో జమచేయకుండా మరమ్మతులు పేరుతో గత సర్పంచ్ స్వంతానికి వాడుకున్నారని ఆరోపించారు.

ఇటీవల వాటర్ ఫిల్టర్ మిషన్ చెడిపోవడంతో వారం పది రోజులుగా గ్రామంలో ఫిల్టర్ వాటర్ అందక పోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే పంచాయతీ అధికారులు వాటర్ ఫిల్టర్ ను స్వాధీనం చేసుకొని గ్రామపంచాయతీ ద్వారా వాటర్ ప్లాంట్ ను నిర్వహించాలని కోరారు. లేనిచో వాటర్ ప్లాంట్ కు వేలంపాట వేసి నిర్వహించాలని, దీంతొ గ్రామ పంచాయతీకి ఆదాయం వస్తుందన్నారు. కార్యక్రమంలో బిఆర్ఏస్ గ్రామ అధ్యక్షుడు నాగేల్లి శ్రీనివాస్ రెడ్డిమాజీ వార్డు సభ్యులు ఎల్లారెడ్డి, ఆంజనేయులు బీఆర్ఎస్ నాయకులు అశోక్, మల్లేశం, అయ్యాలం, బాల్ రెడ్డి, ఆంజనేయులు, ఈశ్వర్, కిష్టయ్య, నాగేందర్, రాంరెడ్డి, భూమయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS