SAKSHITHA NEWS

స్వచ్చాంధ్ర – స్వచ్చ దివస్ ను విజయవంతం చేయండి.

కమిషనర్ ఎన్.మౌర్య

తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మూడవ శనివారం నిర్వహిస్తున్న స్వచ్చాంద్ర – స్వచ్చ దివస్ ను విజయవంతం చేయాలని కమిషనర్ ఎన్.మౌర్య పిలుపునిచ్చారు. స్వచ్చాంద్ర – స్వచ్ దివస్ కార్యక్రమం నిర్వహణపై శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల మూడవ శనివారం ప్రత్యేకమైన పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. స్వచ్చాంద్ర – స్వచ్ దివస్ కార్యక్రమం లో భాగంగా ఏప్రిల్ 2025 లోపు ఇంటింటి చెత్త సేకరణ 100 శాతం నిర్వహించేలా చేయడం, అక్టోబర్ 2025 లోపు చెత్తకుప్పలు లేకుండా చేయాలన్నదే ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. నూతన సంవత్సరంలో క్లీన్ స్టార్ట్ అనే థీమ్ మన ఇల్లు, మన ఆఫీసు, సచివాలయాలు, బస్టాండ్లు, పరిసరాల పరిశుభ్రత పాటించడం చేయాలని అన్నారు. ఇందులో భాగంగా నగరపాలక సంస్థ కార్యాలయం, సచివాలయాలు, ప్రకాశం పార్క్, శెట్టిపల్లి తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలని అన్నారు. మూడవ శనివారం ప్రకాశం పార్కులో పరిశుభ్రత పనులు చేసి, మానవహారం ఏర్పాటు చేస్తామని, శెట్టిపల్లి లో పెద్ద చెత్తకుప్పను తొలగించి చెట్లు నాటే కార్యక్రమం చేస్తున్నామని అన్నారు. ఆటోలు సక్రమంగా రావడం లేదని, మురుగు కాలువలు శుభ్రం చేయించాలని ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ నెలాఖరులోపు అన్ని ఏర్పాట్లు చేస్తామని అన్నారు. ప్రజలు తడి, పొడి చెత్త వేర్వేరుగా తమ సిబ్బందికి ఇవ్వాలని, కాలువల్లో వేయకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కమిషనర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసికుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, తదితరులు ఉన్నారు