SAKSHITHA NEWS

సాక్షిత : * తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని భవన యజమానులు, ఖాళీ జాగా యజమానులకు ఈ ఆర్థిక ఏడాదికి సంబంధించిన ఆస్తి పన్నును ముందస్తుగా ఈనెల ఏప్రిల్ 30వ తారీకు లోగా ఏక మొత్తంగా చెల్లించి 5 శాతం రాయితీ పొందగలరని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత గుడ్ న్యూస్ తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయము నందు ఏర్పాటుచేసిన ప్రత్యేక కౌంటర్ నందు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు పన్నులు చెల్లించవచ్చునని, సెలవు రోజుల్లో కూడా పన్నులు చెల్లించి ఐదు శాతం రాయితీ పొందగలరని కమిషనర్ తెలిపారు.

భవన యజమానులు ఇంటి పన్నులతో పాటు నీటి చార్జీలు, యుడిఎస్ చార్జీలు కూడా సకాలంలో చెల్లించాలని కోరారు. ఖాలీ జాగా యజమానులకు విజ్ఞప్తి చేస్తూ తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని కాళీ జాగాల యజమానులు అందరూ కూడా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మీ స్థలాలకు తప్పకుండా పన్నులు విధించుకోవాలన్నారు. ఖాళీ స్థలాల భద్రత కోసం వాటి యజమానులు తప్పక ఖాళీజాగా పన్ను విధించుకోవాలన్నారు. ప్రజలు తిరుపతి నగరాభివృద్ధి కొరకు సహకరించి సకాలంలో పన్నులు, ఫీజులు నగరపాలక సంస్థకు చెల్లించాలని కమిషనర్ హరిత విజ్ఞప్తి చేశారు.


SAKSHITHA NEWS