SAKSHITHA NEWS

తిరుపతి నగరం*
యువతరం ఓట్లు ప్రగతికి మెట్లు అని, ప్రతి ఒక్క యువత 18 సంవత్సరాలు రాగానే తమ భాధ్యతగా ఓటు హక్కును పొందాలని తిరుపతి నియోజకవర్గం ఓటర్ నమోదు అధికారి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. తిరుపతి న్యూ భాలాజి కాలనీలోని ఎస్.డి.ఎచ్.ఆర్ డిగ్రి కళాశాలలో ఓటర్లుగా నమోదు, ఓటింగ్ ప్రకియ, ఓటింగ్ విధి విధానాలుపై ఎన్నికల కమిషన్ రూపొందించిన స్వీప్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తిరుపతి నియోజకవర్గం ఓటర్ నమోదు అధికారి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కమిషనర్ హరిత మాట్లాడుతూ మన ప్రజా స్వామ్య విధానంలో ఓటు చాలా విలువైనదని, ఓటు వేయడం ద్వారా ప్రత్యక్షంగా ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవచ్చని తెలిపారు. 18 సంవత్సరాలు వచ్చిన ప్రతి ఒక్క యువత ఓటరుగా తమ ప్రాంతంలోని బూత్ లెవల్ ఆఫిసర్స్ ద్వారా గాని, అదేవిధంగా ఎన్నికల కమిషన్ పొర్టల్ ద్వారా ఇంటర్నెట్ ఉపయోగించుకొని తగిన ఆధారాలు సమర్పించి ఓటు హక్కును పొందవచ్చని తెలియజేసారు. అదేవిధంగా ఓటర్లలో అవగాహన కల్పించేందుకు డెమో ఈవియంలు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈవియంలలో తమకు నచ్చిన వారి గుర్తుపై బటన్ నొక్కడం ద్వారా ఓటు నమోదు అవుతుందని, తాము ఎవరికి ఓటు వేసారో ఆ విషయం చిన్న స్లిప్పులో పది సెకండ్ల పాటు కనిపించి బాక్స్ లోకి వెల్లడం జరుగుతుందని కమిషనర్ హరిత వివరించారు. ఓటర్ కార్డు కూడా గుర్తింపు కార్డుగా ఉపయోగించుకోవచ్చన్నారు. కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు ఫారమ్-6 ను, ఇప్పటికే బయట ప్రాంతాల్లో ఓటు వుండి ఇప్పుడు ఇక్కడికి మార్చుకోవాలంటె ఫారమ్-8 ధరఖాస్తులను ఉపయోగించుకోవాలని కమిషనర్ హరిత ఐఏఎస్ సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నియోజకవర్గం ఓటర్ అదనపు నమోదు అధికారి వెంకటరమణ, డిప్యూటీ తాసీల్ధార్ జీవన్ పాల్గొన్నారు.

WhatsApp Image 2023 12 16 at 5.08.17 PM

SAKSHITHA NEWS