కొత్త ఓటర్ నమోదుకు మరోసారి అవకాశం కల్పిస్తూ, ప్రస్థుత ఓటర్ జాబితాలో అభ్యంతరాలు ఏమైనా ఉంటే స్వీకరించి, తుది ఓటరు జాబితా నమోదుకు సరైన పద్ధతులు పాటించేలా జాగ్రత్తగా ఉండాలని తిరుపతి ఓటర్ నమోదు అధికారి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. తిరుపతి నగరంలో , ఆదివారం ప్రజల కోసం పోలింగ్ కేంధ్రాల్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక శిబిరాలను కమిషనర్ హరిత ఐఏఎస్ సత్యనారాయణపురంలోని ఎలిమెంటరీ స్కూల్, జడ్పీ హైస్కూల్లోనూ, అదేవిధంగా సుబ్బారెడ్డి నగర్ లోని సరస్వతి శిశుమందీర్ పాఠశాల, మరికొన్ని శిబిరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమీషనర్ హరిత ఐఏఎస్ మాట్లాడుతూ , ఆదివారాల్లో తిరుపతి నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఆ ప్రాంతాల ఓటర్ల ముసాయిదా జాబితాతో బూత్ లెవెల్ ఆఫీసర్లు ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.
ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు ముసాయిదా ఓటర్ జాబితాలో పేర్లను పరిశీలించుకోవచ్చని, ఒకవేళ తమ పేర్లు ఓటర్ లిస్టులో లేకపోతే వెంటనే నమోదు చేయించుకోవాలని, అదేవిధంగా మరణించిన వారి ఓట్లు జాబితాలో ఇంకనూ ఉంటే సరైన ఆధారాలతో ఆ ఓట్లను తొలగించేందుకు దరఖాస్తులు చేయాలన్నారు. బూత్ లెవల్ ఆఫిసర్స్ కు సూచనలు జారీ చేస్తూ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులైన బూత్ లెవెల్ ఏజెంట్లకు సమాచారం ఇచ్చి, వారికి మసాయిదా జాబితాను చూపించి, అందులో ఏవైనా చేరికలు, మార్పులు ఉంటే వ్రాతపూర్వకంగా దరఖాస్తులు స్వీకరించాలని, అలాంటి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి తమ దృష్టికి తీసుకురావాలని తిరుపతి నియోజకవర్గం ఓటర్ నమోదు అధికారి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ సూచించారు. కమిషనర్ వెంట తిరుపతి నియోజకవర్గం ఓటర్ నమోదు అదనపు అధికారి, తిరుపతి అర్భన్ ఎమ్మార్వో వెంకటరమణా వున్నారు.*