విజయవంతంగా కొనసాగుతున్న ప్రజా ప్రతినిధుల విజ్ఞాన స్టడీ టూర్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు నిర్దేశకత్వం…నేతృత్వంలో నామ ఆహ్వానం మేరకు విజ్ఞాన యాత్రలో భాగంగా న్యూఢిల్లి వెళ్లిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజా ప్రతినిధుల విజ్ఞాన యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. వివిధ చారిత్రక ప్రదేశాలను తిలకించారు.ఈ సందర్భంగా తాజ్ మహల్, రెడ్ పోర్ట్ తదితర చారిత్రక కట్టడాలను సందర్శించి, విజ్ఞాన విషయాలను తెలుసుకున్నారు.ఆదివారం మరికొన్ని చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారని ఎంపీ క్యాంప్ కార్యాలయం తెలిపింది. ఈ విజ్ఞాన యాత్రలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు (పాల్వంచ), సొసైటీ అధ్యక్షులు మండే వీర హన్మంతరావు, అన్నపురెడ్డిపల్లి అశ్వారావుపేట, దమ్మపేట, పాల్వంచ , చండ్రుగొండ, , లక్ష్మీదేవిపల్లి, ములకలపల్లి మండలాల పార్టీ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు, బండి పుల్లారావు, దొడ్డాకుల రాజేశ్వరరావు, పూసల విశ్వనాధం,మల్లెల శ్రీరామ్మూర్తి, మంతపురి రాజుగౌడ్, దారా వెంకటేశ్వరరావు, కొట్టి వెంకటేశ్వరరావు, మోరంపూడి అప్పారావు, జెట్పీటీసీలు పైడి వెంకటేశ్వరరావు( దమ్మపేట ) , బరపాటి వాసుదేవరావు ( పాల్వంచ ) , భరత లాలమ్మ, భరత రాంబాబు , భరత లాస్యశ్రీ ( అన్నపురెడ్డిపల్లి ) , జెట్పీ కో ఆప్షన్ సయ్యద్ రసూల్, ఎంపీపీ లు జల్లేపల్లి శ్రీరామ్మూర్తి( అశ్వారావుపేట ) , మేడి సరస్వతి ( పాల్వంచ), మట్ల నాగమణి( ములకలపల్లి, భూక్యా సోన ( లక్ష్మీదేవిపల్లి ) , భూక్యా బాలాజీ , పాయం లలిత , సున్నం ప్రసాద్ ( అన్నపురెడ్డిపల్లి) , సోయం ప్రసాద్ ( దమ్మపేట) , కొత్తగూడెం కు చెందిన పాటిబండ్ల వీరవర ప్రసాద్ విజ్ఞాన యాత్రలో ఉన్నారు.