విశ్వకర్మ జయంతి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి విశ్వకర్మ సేవ దళ్ వ్యవస్థపాక అధ్యక్షులు చిప్పాడ చందు
సాక్షిత : రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు ఉపాముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా పాల్గొనేలా భగవాన్ విశ్వకర్మ జయంతి సెప్టెంబర్ 17 ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి చేతి వృత్తి దారుల పట్ల మీ చిత్తశుద్ధి విశ్వకర్మ జయంతి సందర్బంగా చూపాలని విశ్వకర్మ సేవాదళ్ వ్యవస్థపాక అధ్యక్షులు చిప్పాడ చందు అన్నారు
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ సకల సృష్టి కర్త భగవాన్ విశ్వకర్మ జయంతి కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లు గా అధికారికంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారే స్వయంగా పాల్గొని అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ చేతి వృత్తులను గౌరవిస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత పాలకులు చేసిన తప్పే ఈ ప్రభుత్వం కూడా చేయద్దు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి ని ఎన్డిఏ కూటమి ని విశ్వకర్మ జయంతి కార్యక్రమం అధికారికంగా నిర్వహించాలని రాష్ట్రoలో ఉన్న విశ్వ బ్రాహ్మణుల తరుపున కోరుతున్నాము
ఈ కార్యక్రమంలో విశ్వకర్మ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ దనాల కోట వాసు, ఆంధ్రప్రదేశ్ కార్పెంటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తాడికొండ రంగబాబు, రాష్ట్ర స్వర్ణ కార సంగం ఉపాధక్షులు పట్నాల సత్యనారాయణ, ఉమ్మడి కృష్ణ జిల్లా స్వర్ణకార సంగం ప్రధాన కార్యదర్శి దమర్శింగ్ ప్రకాష్ పాల్గొన్నారు
sakshitha news
download app
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app