SAKSHITHA NEWS

పోలీసులకు సహకరిస్తూ నిబంధనల ప్రకారం వినాయక నవరాత్రులను శాంతియుతంగా నిర్వహించుకోవాలి – కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు

సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT హిల్స్ కమ్యూనిటీ హాల్ లో వినాయకచవితి సందర్భంగా మండపాల ఏర్పాటు, ఉత్సవాల నిర్వహణ పై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో KPHB డిటెక్టీవ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ తో మరియు ట్రాఫిక్ అధికారులతో, చుట్టూ ప్రక్కల కాలనీ వాసులతో కలిసి పాల్గొన్న హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ వినాయకచవితి సందర్భంగా మండపాల ఏర్పాటు, ఉత్సవాల నిర్వహణకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని తెలియజేసారు. పండుగను నిబంధనల ప్రకారం శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు తగు చర్యలు తీసుకోవాలని, పోలీసులకు సహకరిస్తూ వినాయక నవరాత్రులను ప్రశాంతంగా జరుపుకోవాలని అన్నారు. వినాయక విగ్రహాల ప్రతిష్టాపనకు ముందు వినాయక మండపాల ఏర్పాటు కోసం మీ దగ్గర్లోని మీసేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని తద్వారా జియో ట్యాగింగ్ చేసి ఏ సమస్య వచ్చిన వెంటనే ఆ ప్రదేశానికి చేరుకోవడానికి పోలీసులకు వీలు ఉంటుందని నిర్వాహకులకు వివరించారు. అదేవిధంగా మున్సిపల్, అగ్నిమాపక, విద్యుత్‌ శాఖ, వాటర్, ట్రాఫిక్, ఇతర శాఖల నుండి అనుమతులను తీసుకోవాలని సూచించారు. అంతటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి అని, మట్టి వినాయక ప్రతిమలనే వినియోగించాలి అని, ఊరేగింపు సమయంలో అశ్లీల పాటలు, నృత్యాలు చేయకూడదని, మందుగుండు సామగ్రి వెలిగించరాదని, శబ్ద కాలుష్యం లేకుండా పగటిపూట 55 డెసిబుల్స్‌, రాత్రి వేళ 45 డెసిబుల్స్‌ దాటకుండా చూసుకోవాలని బాక్స్‌ టైపు స్పీకర్లనే వినియోగించాలి అని ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు ఎస్ఐ లు మాధవ రెడ్డి, సుమన్, మన్యం, రూప, మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS