చిట్యాల (సాక్షిత ప్రతినిధి)
చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో పల్లె పల్లెకు ఓబీసీ ఇంటింటికి బిజెపి కార్యక్రమాన్ని ఓబిసి మోర్చా చిట్యాల మండల కోఆర్డినేటర్స్ గుండెబోయిన నరసింహ ముదిరాజ్ నూతి విశ్వతేజ ముదిరాజ్ ల ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఓబిసి మోర్చా భరోసా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి అతిథిగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు పాల్గొని మాట్లాడుతూ పల్లె పల్లెకు ఓబీసీ కార్యక్రమంలో ఇంటింటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ బీసీలకు చేకూర్చిన ప్రయోజనాలు గురించి తెలియజేయడం జరిగింది. వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ 102 వ రాజ్యాంగ సవరణ చట్టం 2018 వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ కి రాజ్యాంగ హోదాను అందిస్తుందన్నారు, 105వ రాజ్యాంగ సవరణ చట్టం సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతుల వారి రాష్ట్రాల ఓబిసి జాబితాను రూపొందించే హక్కు కేంద్ర పాలిత ప్రాంతాలకు రాష్ట్రాలకు కల్పించిన కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ అని తెలియజేశారు.
ఓ బి సి ఆదాయ క్రిమిలేయర్ సవరణ 2017లో ఓబీసీ క్రిమిలేయర్ ఆదాయాన్ని రూపాయలు ఆరు లక్షల నుండి 8 లక్షలకు పెంచారన్నారు, 27 ఓబిసి మంత్రులు మొదటిసారి కేంద్ర మంత్రివర్గంలో 27 మంది ఓబీసీలకు స్థానం కల్పించారని, పిఎస్ యు లో ఓ బీసీలకు రిజర్వేషన్లు ఓబీసీ వర్గాల సంక్షేమం సాధికారతకు సంబంధించి వారికి రిజర్వేషన్లు కల్పించేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని అవకాశాలను ప్రయత్నిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ కమిటీ అధ్యక్షులు ఉయ్యాల లింగస్వామి గౌడ్, ఈదుల పవన్, యువజన నాయకులు మర్రి హరీష్ రెడ్డి, కాటo సందీప్ యాదవ్, వెంకటేష్, శ్రీనివాస్, నరసింహ, రాములు, సత్యం, అశోక్, మధు తదితరులు పాల్గొన్నారు