కూటమి ప్రభుత్వం పాలనతోనే గ్రామాల అభివృద్ధి – ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి …
జలుమూరు మండలం
“పల్లె పండుగ” పంచాయతీ వారోత్సవాలు కార్యక్రమంలో భాగంగా జలుమూరు మండలం,లింగాలవలస పంచాయతీలో ఉసిరిజోల గ్రామానికి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం క్రింద 98 లక్షల రూపాయలు నిధులతో బిటి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి …
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసిపి పాలన ఐదేళ్లలో గ్రామీణ ప్రాంతాలకు కనీసం మౌలిక సదుపాయాలకు నోచుకోక అద్వాన పరిస్థితికి చేరుకుందని,ప్రజల దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నారని అన్నారు.పల్లెలకు పూర్వం వైభవం తెచ్చేందుకు పల్లె పండుగ పేరుతో కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ,ఎంపీడీవో , మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు, పంచాయతీరాజ్ ఇంజనీర్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.