ప్రత్యేక అలంకరణలో విజయాంజనేయ స్వామి
శ్రావణ సందర్భంగా ఆలయానికి పోటెత్తిన భక్తులు
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీరామ్ నగర్ కాలనీ శ్రీ విజయాంజనేయ స్వామి దేవస్థానం నందు శ్రావణమాసం సందర్భంగా ఆలయ అర్చకులు మరింగంటి వరదాచార్యులు స్వామివారికి విశేషంగా అభిషేకం నిర్వహించి అలంకరణ చేశారు.శ్రావణమాసం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు రామనామ స్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా అర్చకుడు మాట్లాడుతూ శ్రావణమాసం నెలరోజులపాటు విశేష పూజలు పర్వదిన కార్యక్రమాలు మరియు సామూహికంగా భక్తులచే వరలక్ష్మీ వ్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేశారు.
కోరిన కోరికలు తీర్చే శ్రీ విజయాంజనేయ స్వామి వారిని దర్శించి 11 ప్రదక్షణలు చేసి కోరిక కోరుకున్నట్లైతే సత్వరమే అవి నెరవేరుతాయని ఇక్కడ ప్రసిద్ధి.ఆలయంలో ప్రతి శనివారం సాయంత్రం 6:30 నుండి భక్తులచే సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం మరియు భజన కార్యక్రమం నిర్వహిస్తారని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ అర్చకుడు ముడుంభై రఘువరన్ ఆచార్యులు ఆలయ కమిటీ అధ్యక్షులు మండల రెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాన కార్యదర్శి నాగవేళ్ళి దశరథ కోశాధికారి యలమద్ది అశోక్ కుమార్ భక్తులు మంచికంటి హనుమంతరావు నాగవేళ్ళి కుమారస్వామి ఆవుల జానయ్య మణెమ్మ లింగారెడ్డి అజిత మరియు తదితరులు పాల్గొన్నారు.