SAKSHITHA NEWS

ఆల్విన్ కాలనీ ఫేస్ 2 లో పాదయాత్ర యాత్ర చేసిన వెంకటేష్ గౌడ్

సాక్షిత : 124 డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ 2 లో డ్రైనేజ్ మరియు రోడ్లకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని స్థానిక వాసులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకుని రాగా కార్పొరేటర్ అల్విన్ కాలనీ ఫేస్ 2 లో పాదయాత్ర చేసి సమస్యలను స్వయంగా పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీలోని ఒక వీధిలో డ్రైనేజ్ లైన్ మరియు కొంతమేర సిసి రోడ్ పనులు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి అతి త్వరలో నిర్మాణ పనులు చేపట్టే విధంగా కృషి చేస్తానని కాలనీ ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, కాలనీ అధ్యక్షులు కృష్ణారావు, భాస్కర్ రెడ్డి, పోశెట్టిగౌడ్, మురళి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS