SAKSHITHA NEWS

వేమూరు లో జరిగినవేమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ-జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం లో పాల్గొన్న మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు .

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు, తదనంతర పరిణామాలు,భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించేందుకు వేమూరు లోని NTR పురవేదిక వద్దా వేమూరు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, మరియు ప్రజాధనాన్ని వైసీపీ నేతలు దోపిడీ చేయడం, ఓటర్ వెరిఫికేషన్, రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాలపై చర్చించడం జరిగింది.

ఈ సమావేశం లో రాష్ట్ర
వేమూరు నియోజకవర్గ, తెలుగుదేశం పార్టీ-జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశానికి అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ –

జగన్ చెర నుండి రాష్ట్రాన్ని, ప్రజలను విడుదల చేయాలి తెదేపా విస్తృత సమావేశం లో పిలుపునిచ్చారు.

వైసిపి ప్రభుత్వం సాగిస్తున్న నిర్బంధకాండ పైన ఒకవైపు పోరాటం చేస్తూనే మరోవైపు ఎన్నికలకు సమాయత్తం కావాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రతి నేత, కార్యకర్త ప్రతిరోజూ పార్టీ కోసం పని చేయాలని, ప్రజల మధ్యే ఉండాలని పిలుపునిచ్చారు.

పిచ్చి జగన్ రెడ్డి ఏదైతే జరగక్కూడదని భయపడ్తాడో.. ఇది జరిగిందని, టిడిపి జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయని, అయితే ఈ పొత్తును చెడగొ ట్టేందు సైకో జగన్రెడ్డి కుట్రలు చేస్తున్నారని, పేటీయం. బ్యాచ్ చేత సోషల్ మీడియాలో దొంగ భాతాలు సృష్టిం చి తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని, టిడిపి శ్రేణులంతా ఈ ప్రచారం పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు.

3 వ తేదీ ఆదివారం ఓటర్ స్పెషల్ క్యాంపైన్ ప్రతి బూత్ ల లో జరుగుతుంది.

కావున వేమూరు నియోజకవర్గం లోని ప్రతి బూత్ ల లోని బూత్ ఇంచార్జి లు, యూనిట్, క్లస్టర్ ఇంచార్జ్ లు ఈ 2 రోజులు ఈ సదవకాశం వినియోగించుకొని అందరు BLA లు పోలింగ్ కేంద్రంలో ఉండి ప్రతి ఓటు తీసివేయుటకు మరియు చేర్చుటకు ఉపయోగించుకోవాలి.

ఈ రెండు రోజులు ప్రతి BLA పర్యవేక్షణ చేస్తూ ఎన్ని ఫారం 6 మరియు ఫారం 7 పెట్టాడు అనే సమాచారం సేకరణ చేయాలి.

ఓటర్ లిస్ట్లను జాగ్రత్తగా పరిశీలించి దొంగ ఓట్లు ఉంటే గుర్తించాలని, తొలగించిన ఓట్లను తిరిగి చేర్చిం చాలని చెప్పారు.

సైకో జగన్ అనే రాక్షసుడు కాదు పిచ్చోడు తో పోరాడుతున్నాం.

సైకో జగన్ పాలనపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ప్రజల్లోకి వెళదాం, ప్రజాచైతన్యం తీసుకొద్దాం”.

రాష్ట్రాన్ని ముక్కలు ముక్కలుగా చేసే దిశగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్రెడ్డి దురాగతాన్ని నిరోధించటానికి జనసేనతో కలిసి పోటీ చేయటం అవసరమని స్పష్టం చేశారు.
బాబుష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ, ఓటర్ లిస్టుల సవరణ, నిజం గెలవాలి, సంస్థాగత నిర్మాణం విషయాలపై సుదీర్ఘంగా పార్టీ నాయకులు చర్చించారు.

కేవలం నాలుగు నెలల సమయం మాత్రమే ఉందని, టిడిపి నేతలు-జనసేన నాయకులు కార్యకర్తలంతా
ప్రతిరోజూ ప్రజలతో మమేకం కావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

రోబోయే రోజుల్లో తెదేపా-జనసేన క్షేత్రస్థాయి కార్యక్రమాలలో అందరూ భాగస్వాములు కావాలి.

ఓటర్ లిస్టుల సవరణకు సంబంధించి పార్టీ చేస్తున్న ప్రస్తుత తనిఖీ, అభ్యంతరాల కార్యక్రమాలు
కొనసాగుతాయి.

జగన్ వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే మళ్ళీ జైలు కే పరిమితం అవుతారని చంద్రబాబు పై దుష్ట ఆలోచన చేసి అవినీతి మరకలు అంటించి జైల్లో పెట్టారు.

జనసేన టీడీపీ కలిసి రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు నాయకులు, కార్యకర్తలతో కలిసిముందుకు వెళ్తాము.

పిచ్చి పట్టిన వ్యక్తి పరిపాలన చేస్తున్నారు. పిచ్చి పట్టిన వాడిని తరిమి తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రజలపై, కార్యకర్తల పై ఉంది.

చంద్రబునాయుడు అరెస్ట్ చేస్తే టీడీపీ పనియిపోతుందని అనుకున్నారు కానీ కసితో పనిచేస్తూ ముందుకు వెళ్తున్నారు.

జగన్ లాంటి సైతాన్ని, పిచ్చోడిని తరిమి కొట్టే వరకు ఇదే పోరాటం,చితసుద్దితో, ప్రతి ఒక్కరూ పని చెయ్యాలి.

‘బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమం అన్ని గ్రామాలలో విధిగా జరగాలి.

ఇందులో భాగంగా వివిధ స్థాయిల్లోని తెలుగుదేశం పార్టీ నేతలు-జనసేన పార్టీ సమన్వయం తో పార్టీ శ్రేణులు ఇంటింటికి వెళ్ళి పార్టీ ప్రకటించిన సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో వివిధ పథకాల కింద ప్రతి కుటుంబానికి లభించే లబ్ధిని వివరించి ఆ మేరకు చంద్రబాబు సంతకంతో కూడిన ఒక గ్యారంటీ బాండు ను అందించాలి .

ఈ కార్యక్రమాలన్నింటిని విజయవంతం చేయాలని తెదేపా-జనసేన విస్తృత సమావేశం పిలుపునిచ్చారు.

Whatsapp Image 2023 12 02 At 3.52.56 Pm

SAKSHITHA NEWS