ఇసుక రవాణా చేసే వాహనాలు జాయింట్ కలెక్టర్ ఆమోదం తప్పనిసరి
-ట్రక్కు షీట్ లో డెలివరీ చిరునామా సమగ్ర వివరాలు తప్పనిసరి
-పీజీఆర్ఎస్ పెండింగ్ అర్జీల పై ప్రతివారం ఆడిటింగ్ నిర్వహిస్తా ..
-మండల స్థాయిలో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చెయ్యండి
కలెక్టర్ ప్రశాంతి
రాజమహేంద్రవరం, సాక్షిత :
ఉచిత ఇసుక కోసం రీచ్ లకి వొచ్చే వాహనాలకు స్లాట్ కేటాయింపు చేసి ట్రక్కు షీట్ జారీ చెయ్యాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు
మంగళవారం ఉదయం డివిజన్ మండల స్థాయి అధికారులతో ఇసుక రవాణా, పి జి ఆర్ ఎస్, తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు తో కలిసి కలెక్టరు సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశాల జారీ చేస్తూ, ఇసుక కోసం వొచ్చే వాహనాలకు జాయింట్ కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి మాత్రమే బుకింగ్ పాయింట్ వద్ద కు అనుమతించి, ఆమేరకు ట్రక్కు షీట్ జారీ చెయ్యాలన్నారు. ఇసుక పంపిణి విధానం ఎటువంటి అవకతవకలు లేకుండా ఎన్ఫోర్స్మెంట్ బృందాలు విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక అర్జీలను పరిష్కారం కోసం ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న 492 లో 490 అర్జీలను అధికారులు పరిశీలించినట్లు తెలియ చేశారు. హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ వద్ద ఒక అర్జీ , బిక్కవోలు మండల్ సర్వేయర్ వద్ద నిన్నటి వరకు పెండింగ్ గా చూపించిందన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో ఉన్న పి జి ఆర్ ఎస్ అర్జీలను పరిశీలించి పరిష్కార చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్ ఎల్ ఏ పరిధిలోగా అర్జీలు పరిష్కారం తప్పనిసరి పేర్కొన్నారు. రెవిన్యూ సంబంధ అర్జీలు విషయంలో రాష్ట్ర స్థాయి నుంచి నేరుగా పురోగతి పై పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.
ఈ విషయములో తహసీల్దార్, రెవిన్యూ డివిజన్ అధికారులు చట్ట ప్రకారం ఆర్ వో ఆర్ తదితర అంశాలపై పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం మండల స్థాయిలో ఏర్పాటు చేసిన త్రీ మ్యాన్ కమిటీ ద్వారా క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. పోలీసు, పంచాయతీ రాజ్, ఇరిగేషన్, మైన్స్ , తదితర శాఖల అర్జీలు అత్యధికంగా ఉన్నట్లు తెలిపారు. ఇకపై పీజీఆర్ఎస్ పెండింగ్ అర్జీల పై ప్రతివారం ఆడిటింగ్ నిర్వహిస్తా నని, అదేవిధంగా జాయింట్ కలెక్టర్, జిల్లా రెవిన్యూ అధికారి కూడా వివిధ అంశాల పై ఆడిటింగ్ చేస్తారని పేర్కొన్నారు. పెండింగ్ అర్జీలు పరిష్కారం కోసం క్షేత్ర స్థాయిలో వ్యక్తిగతం పరిశీలన చేసి, వాటికి పరిష్కారం కోసం ప్రతి ఒక్క అధికారి వ్యక్తిగత పర్యవేక్షణ తప్పనిసరి అని ఆదేశించారు. ఇందులో భాగంగా మండల స్థాయిలో ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి, వాటిని పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. సంస్థాగత లోపాలు ఉంటే వాటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. రీఓపెన్ కాకుండా సమస్యల పరిష్కార మార్గాలు చూపాల్సి ఉంటుందన్నారు. మీ స్థాయిలో పరిష్కారం దిశగా కృషి చేయని ఎడల జిల్లా స్థాయిలో తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు , డివిజనల్ అభివృద్ధి అధికారులు పి. వీణా దేవి, వి. శాంతా మణి, కలక్టరేట్ ల్యాండ్ సూపరింటెండెంట్ ఎండీ ఆలీ పాల్గొన్నారు.