డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ బీ ఆర్ ఎస్ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ కు వివిధ సంఘాలు, సంస్థలు, తటస్తులు నుంచి మద్దతు లభిస్తోంది. వివిధ వర్గాలకు చెందిన వారు పద్మారావు గౌడ్ ను కలిసి ఆయనకు ఎన్నికల్లో బేషరతుగా మద్దతు తెలుపుతున్నారు.
నాయి బ్రాహ్మణులకు ప్రోత్సాహం
ఈ క్రమంలో తెలంగాణా నాయి బ్రాహ్మణా సంఘం ప్రథినిధుల సమావేశం శ్రీనివాస్ నగర్ కాలనీ లోని సంఘం కార్యాలయంలో జరిగింది. సంఘం అధ్య్కష్టు జె.రాంబాబు నాయి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి ఓంప్రకాష్ నాయి. కోశాధికారి శంకర్ నాయి. గౌరవాధ్యక్షుడు మనోహర్ నాయి, నేతలు హరినాద్. కే.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి హాజరైన డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ బీ ఆర్ ఎస్ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ ను సంఘం నేతలు ఘనంగా సత్కరించారు. గత పదేళ్లుగా సికింద్రాబాద్ లో నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి పద్మారావు గౌడ్ కృషి చేశారని పేర్కొంటూ, ప్రస్తుత ఎన్నికల్లో పూర్తి మద్దతు నిస్తామని రాంబాబు నాయి తదితరులు ప్రకటించారు. ఈ మేరకు ఓ తీర్మానాన్ని పద్మారావు గౌడ్ కు అందించారు. వారికీ పద్మారావు గౌడ్ కృతఙ్ఞతలు తెలిపారు. నాయి బ్రాహ్మణులను ప్రోత్సహిస్తున్నామని, వారి సాధక బాధకల్లో భాగస్వామ్యమవుతున్నానని పేర్కొన్నారు.
విశ్వబ్రాహ్మణుల సంఘం మద్దతు
తెలంగాణా విశ్వ బ్రాహ్మణ సంఘం, పార్సిగుట్ట విభాగం అధ్యక్షుడు ఎల్లగారి శ్రీహరి చారి నేతృత్వంలో ప్రతినిధులు రాఘవా చారి, పెంటాద్రి, భాస్కర్, రమణా చారి తదితరుల బృందం మంగళవారం పద్మారావు గౌడ్ ను సికింద్రాబాద్ లో కలిసి తమ మద్దతును ప్రకటించింది. ఈ మేరకు తమ సంఘం సమావేశంలో ఆమోదించిన తీర్మానాన్ని పద్మారావు గౌడ్ కు శ్రీహర చారి తదితరులు అందజేశారు. వారికీ పద్మారావు గౌడ్ కృతఙ్ఞతలు తెలిపి వారి సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో ని ప్రభుత్వం బీ సీ కులాల సంక్షేమానికి ప్రాముఖతను కల్పిస్తోందని, తాను సైతం వ్యక్తిగతంగా తన వంతు సహకారాన్ని అందిస్తున్నానని పేర్కొన్నారు. హ్యాట్రిక్ సాధించడంలో అన్ని వర్గాలు కృషి చేయాలనీ పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
పద్మారావు కు వివిధ కుల సంఘలా ఏకగ్రీవ మద్దతు
Related Posts
డా. బి ఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు అందుకున్న మన్నెగూడెం
SAKSHITHA NEWS డా. బి ఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు అందుకున్న మన్నెగూడెం డా బిఆర్ అంబేడ్కర్ నేషనల్ అవార్డు – 2024 సంవత్సరమునకు గాను మాల సంక్షేమ సంఘం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి మన్నెగూడెం వేణుగోపాల్ ఎంపిక అయ్యారు.ఈ యొక్క…
ఇందిరమ్మ ఇళ్ల పథకం సర్వే ను ప్రారంభించిన కొండకల్
SAKSHITHA NEWS ఇందిరమ్మ ఇళ్ల పథకం సర్వే ను ప్రారంభించిన కొండకల్ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎల్లయ్య *దళితులు, బీసీలు, మైనారిటీలు, గిరిజనులు వంటి పేద వర్గాలకు గృహ నిర్మాణం అందించటం, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచటం ముఖ్య ఉద్దేశం *సర్వే…