మహాత్మ జ్యోతి బాపులే పాఠశాలలో వన మహోత్సవ కార్యక్రమం…
సాక్షిత : సూర్యాపేట జిల్లా మునగాల మండలం పరిధిలో పర్యావరణ సమతుల్యతను కాపాడటం లో మొక్కల పాత్ర కీలకం:పందిరి నాగిరెడ్డి. ఆకుపాముల వద్ద గల మహాత్మా జ్యోతి బా పూలే గురుకుల పాఠశాల(చిలుకూరు) నందు ముఖ్య అతిదులు గా హాజరైన యం యస్ విద్యా సంస్థల చైర్మన్ పందిరి నాగిరెడ్డి,సీఈవో యస్ యస్ రావులు పాఠశాల ప్రిన్సిపాల్ సిహెచ్ వీరయ్య తో కలిసి పాఠశాల ప్రాంగణం లో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ మొక్కలు నాటడం వలన మానవునికి ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ ను మరియు మంచి ఔషదాలను అందిస్తాయని అన్నారు.
అనంతరం పాఠశాలలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అందించిన 34 కంప్యూటర్ ల లాబ్ ను నాగిరెడ్డి యస్ యస్ రావు లు ప్రారంభించారు.విద్యార్థులకు కంప్యూటర్ జ్ఞానం అవసరమని రాష్ట్ర ప్రభుత్వం ఈ పాఠశాలకు అందించడం అభినందనీయమని నాగిరెడ్డి అన్నారు.బడుగు బలహీన వర్గాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో గురుకులాలను ఏర్పాటు చేసిందని,ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ఉపాధ్యాయులు చిత్తశుద్ధి తో పనిచేసి మంచి ఫలితాలు తీసుకురావాలని కోరారు.అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు అతిథులు పందిరి నాగిరెడ్డి,యస్ యస్ రావు లకు పుష్ప గుచ్చం అందించి శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బ్రహ్మచారి,మధు,స్వాతి, రామక్రిష్ణ విజయ్ కుమార్, రాధాకృష్ణ,రాజేష్,బాలసైదులు,వీరస్వామి, రాజ్ కుమార్,మట్టయ్య తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
