SAKSHITHA NEWS

Vajpayee’s services for the welfare of the country are memorable*

image 50

దేశ శ్రేయస్సు కొరకు వాజ్ పేయి చేసిన సేవలు చిరస్మరణీయం*

సాక్షిత పెద్దపల్లి బ్యూరో :

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో పట్టణ అధ్యక్షులు ఎడ్ల సదశివ్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని, భారత రత్నా అటల్ బిహారి వాజ్ పేయి జయంతి సందర్బంగా వారి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి, స్వీట్లు పంపిణి చేశారు అనంతరం మంథని పట్టణ ప్రధాన కార్యదర్శి సబ్బాని సంతోష్, సీనియర్ నాయకులు బోగోజు శ్రీనివాస్ మాట్లాడుతూ దేశం కోసం ధర్మం కోసం జీవితకాలం రాజకీయాలలో ఉన్నత విలువలను నెలకొల్పిన మహానుభావుని
 జన్మదిన జయంతి ఈరోజు రాజనీతిజ్ఞుడు, సహజ కవి, దేశభక్తి దేశ శ్రేయస్సు కోసం అహర్నిశలు పాటుపడిన వ్యక్తి మన అటల్జీ భారత్ దేశ ఔన్నత్యాన్ని భారత్ ఉనికిని ఐక్యరాజ్య సమితిలో హిందీ లో ప్రసంగించి ప్రపంచానికి చాటారు.అంతర్జాతీయంగా ఎన్ని వత్తిడులు ఉన్న గాని భయపడకుండా పోఖ్రాన్ అణుపరీక్షలు జరిపి భారత్ ను అణ్వస్త్ర దేశంగా తీర్చిదిద్ది దేశాన్ని శక్తివంతంగా చేసిన మాజీ ప్రధాని మన అటల్ బిహారీ వాజ్ పేయి
మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోది గారు 2015లోనే అటల్ జీ జన్మదినాన్ని సుపరిపాలనా దినోత్సవంగా ప్రకటించడం మనము అటల్జీ కి ఇచ్చిన గౌరవంఅని అన్నారు ఈ కార్యక్రమంలొ సీనియర్ నాయకులు నాంపల్లి రమేశ్, వెల్పుల సత్యం, అయింటి మల్లేశ్, బోల్లంపల్లీ లక్ష్మణ్,ఏడ్ల సాగర్, పార్వతి విష్ణు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS