కవులూరులో ప్రతి గడపలో అపూర్వ ఆదరణ
ఆత్మీయ స్వాగతంలో ఆహ్వానిస్తున్న గ్రామస్తులు* పార్టీలకతీతంగా బ్రహ్మరథం పడుతున్న ప్రజలు*
మూడవ రోజు కవులూరులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ .
సాక్షిత : ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం కవులూరు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. మూడవరోజు జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ప్రతిగడపకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కవులూరు గ్రామస్తులు అతిథి మర్యాదలతో ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. ఆత్మీయంగా వారి గడపల్లోకి ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం నుంచి చేకూరిన లబ్దిని ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలు వింటూ వాటి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేస్తున్నారు.
ఇదే సందర్భంలో ఆయనకు గ్రామస్తులు సిమెంట్ రహదారులు, తాగునీటి పైపులైన్లు, డ్రైనేజీలు నిర్మించాలని కోరగా శాసనసభ్యుని నిధుల నుంచి ఆయా సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయిస్తానని హామీలు ఇచ్చారు. అర్హతలు ఉన్న వారందరికీ సంక్షేమ పథకాలు వర్తింప చేస్తున్నట్లు పేర్కొన్నారు. సాంకేతిక కారణాల వల్ల సంక్షేమ లబ్ది పొందలేని వారికి, తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 98.5 శాతం అమలు చేశారని పేర్కొన్నారు. కుల, మత, వర్గ, జాతి, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు మంచి చేశామని, మీకు మంచి చేస్తేనే మీరంతా జగనన్నకు తోడుగా ఉండాలన్నారు. ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దని, వాళ్ల కుట్రలను చేధించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ వేములకొండ లక్ష్మీ తిరుపతమ్మ , మండల వైకాపా అధ్యక్షులు నెల్లూరు లీలా శ్రీనివాసరావు , సచివాలయాల మండల కో ఆర్డినేటర్ కాజా బ్రహ్మయ్య , వైస్ ఎంపీపీ ఈలప్రోలు తేజస్విని , సర్పంచి కొండా మరియమ్మ , ఉప సర్పంచ్ బొర్రా నరేంద్రబాబు , ఎంపీటీసీ డోల మధుబాబు , నాయకులు గొట్టుముక్కల ఓంకార్ బాబు , ఈలప్రోలు వెంకటేశ్వరరావు , గుణదల వెంకటేశ్వరరావు , సూదిరెడ్డి సురేష్ , బొర్రా భూలక్ష్మీ , చెరుకూరి సాంబశివరావు , బేతపూడి కృష్ణవేణి , స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైకాపా నాయకులు, ముస్లిం, మైనార్టీ సోదరులు, వైసీపీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.