SAKSHITHA NEWS

మహా కుంభమేళలో పవిత్ర స్నానం ఆచరించిన కేంద్రమంత్రి అమిత్ షా!

హైదరాబాద్
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు మహా కుంభమేళాలో పవిత్ర స్నానం చేయనున్నారు. నిన్న అంటే ఆదివారం నాడు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ గంగానదిలో స్నానం చేశారు. నేడు అమిత్ సా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరిస్తారు.

దీని తరువాత ఆయన అఖారా సాధువులను కలుస్తారు. 144 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ మహా కుంభమేళాకు లక్షలాది మంది భక్తులు తరలివ చ్చారు. ఇప్పటివరకు కోట్లాది మంది భక్తులు స్నానాలు చేశారు.

ఈ మహా కుంభమేళాను సమానత్వం, సామరస్యంల మహా కుంభమే అని పిలు స్తారు.ఇటీవల గుజరాత్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ.. మహా కుంభమేళా 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని అన్నారు.

అందరూ అక్కడికి వెళ్ళాలి. నా జీవితంలో 9 సార్లు కుంభమేళాకు వెళ్ళానని, అర్ధ కుంభమేళా కూడా చూశానని ఆయన అన్నారు. కుంభమేళా సామరస్యం, ఐక్యత సందేశాన్ని ఇస్తుందని ఆయన అన్నారు. గుజరాత్ ప్రజలు ముఖ్యంగా యువతరం మహా కుంభమేళాకు హాజరు కావాలని షా కోరారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app