SAKSHITHA NEWS

సోశలిస్ట్ రాజ్య స్థాపన భగత్సింగ్ ధ్యేయం

నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలి,దేశ భవితను కాపాడాలి

అఖిల భారత యువజన సమాఖ్య (AIFY) మండల అధ్యక్షులు — గోధ వెంకటేష్ యాదవ్

నేడు 94వ భగత్సింగ్ జయంతి సందర్భంగా కుద్బుల్లాపూర్ నియోజకవర్గ అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) ఆధ్వర్యంలో జగత్గిరిగుట్ట లాస్ట్ బస్టాప్ లో గల భగత్సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గోధా వెంకటేష్ యాదవ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర నాయకులు ఏసురత్నం మాట్లాడుతూ సమసమాజ స్థాపనే ధ్యేయంగా,సోషలిస్టు రాజ్య స్థాపన కొరకు తన ప్రాణాలర్పించిన యోధుడు షహీద్ భగత్ సింగ్ అన్నారు,తదనుగుణంగా నేటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రగ్స్ పై కఠిన చర్యలు తీసుకొనందువల్ల యువత పేడతో పడుతున్నారని,వారికి సరైన అవగాహన కల్పించి ఉపాధి,ఉద్యోగావకాశాలు కల్పిస్తే యువత చెడుతోవలో వెళ్లకుండా రేపటి దేశ అభివృద్ధి పదానికి బాసటగా నిలుస్తారని తెలిపారు.దేశ భవితకు పట్టు కొమ్మలైన యువత నేడు దేశ భక్తిని విస్మరించి దైవ భక్తికి లోనౌతున్నారని దాని వల్ల భక్తి ముక్తిని ఇస్తుందోలేదో తెలియదుగానీ ప్రజలకు భక్తిని ఇవ్వలేదని , అందువల్ల ఊకదంపుడు ఉచితాలను మాని ఉపాధి కల్పించాలని అందువల్లే దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బాగుంటుందని తెలియజేసారు.కుల మత వర్గ వర్ణ ధనిక పేద తేడా లేని సమసమాజ నిర్మాణం జరగాలంటే సోషలిస్టు రాజ్య స్థాపన తోనే వస్తుందని ఆరోజే భగత్ సింగ్ కు నిజమైన నివాళులు అర్పించిన వారమౌతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి కత్తుల దుర్గయ్య, జార్జ్,శ్రీనివాస్,భీమేశ్,సిపిఐ AIYF నాయకులు పి.నర్సయ్య,బాబు రావు, రాములు,హరినాథ్ రావు,యాదయ్య,ఆవుల కృష్ణ,వంగాళ శ్రీనివాస్,సహాదేవ రెడ్డి,యాదగిరి,సామ్యూల్,ఇమామ్,జంబూ,ప్రభాకర్,తదితరులు పాల్గొన్నారు