SAKSHITHA NEWS

అనుమతిలేని బాణాసంచా నిల్వలు, దుకాణాల ఏర్పాటు, అమ్మకాలపై జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించిన మార్కాపురం పోలీసులు.

దీపావళి పండుగ దృష్ట్యా ఏవరైనా అనుమతి లేకుండా బాణ సంచా/టపాసులను ఇళ్లల్లో, షాపులలో, ఊరిమధ్య గోడౌన్‌లలో స్టాకు అనుమతి లేకుండా నిల్వలు కలిగి ఉంటే చట్టపరమైన చర్యలు.

ప్రకాశం జిల్లా SP శ్రీమతి మలిక గర్గ్, IPS., సూచన మేరకు జిల్లా అంతటా అన్ని పోలీసు స్టేషన్లు పరిధిలో ముమ్మర తనిఖీలు మార్కాపురం పోలీస్ అధికారులు సిఐ భీమా నాయక్ మరియు సిబ్బంది కలిసి నిర్వహిస్తున్నారు. దీపావళి స్టాకు పెట్టేవారికి ఆర్‌డిఒ ద్వారా లైసెన్స్‌లు తప్పనిసరి, మరియు ప్రమాదాలు జరగకుండా బాణ సంచా విక్రయదారులు తగు జాగ్రత్తలు పాటించాలి. గతంలో లైసెన్సులు పొందినవారుగాని, షాపులవారుగాని వీటిని అనుమతులు లేకుండా నిల్వ చేసినా, విక్రయించినా కేసులు నమోదు చేస్తామన్నారు. పట్టణ ప్రజలు కూడా వారివారి పరిసరప్రాంతాలలో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే దయచేసి Dail100కు తెలియజేయగలరు.


SAKSHITHA NEWS