తెదేపాలోకి వైకాపా కార్యకర్తలు చేరికలు
యు. కొత్తపల్లి జనసేన ప్రతినిధి మే 26 కాకినాడ జిల్లా
యండపల్లి గ్రామంలో బండి నాగేంద్ర ఆధ్వర్యంలో సుమారు 100 మందికి పైగా వైకాపా కార్యకర్తలు గురువారం తెదేపా లోకి మాజీ ఎమ్మెల్యే వర్మ సమక్షంలో చేరారు . ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ వైకాపా దుర్మార్గపు పాలనా వలన ప్రజలు పడుతున్న ఇబ్బందులు , అవినీతి పనులు , రాష్ట్రంలో అభివృద్ధి లేకపోవడం , ఇవ్వన్నిటి పై ప్రజలకు విసుకు చెంది తెలుగుదేశంలోకి చేరారు అని అయన తెలిపారు. పార్టీలో చేరినందుకు సభ్యులకు అందరికి ధన్యవాదాలు తెలిపి, వీళ్ళ రాకతో గ్రామంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని అయన ధీమా వ్యక్తం చేసారు . సుమారుగా మా హయాంలో ఈ గ్రామాన్ని 10కోట్లతో అభివృద్ధి చేయడం జరిగిందని , గ్రామానికి మినీ ఫంక్షన్ హాల్ మంజూరు చేసామని , దీనిని ఈ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాయకులు పంచాయితి కార్యాలయంగా మార్చారు అని అన్నారు .
రోడ్ల అభివృద్ధి 2కోట్ల లతో అభివృద్ది చేస్తే , వైకాపా చేసింది ఏమి లేదని , రైతులు శ్రేయస్సు కోసం ధాన్యం సరపరాలో సులువు కొరకు బ్రిడ్జి నిర్మాణం చేసి రైతులను ఆదుకోని ట్రాన్స్పోర్ట్ చార్జీలు లేకుండా చేసామని అన్నారు .రైతులు పొలాలు మునగకుండా ఏలేరు ఫేస్ -2 తీసుకురావడం జరిగినది అని నాగులపల్లిలో పనులు మొదలు పెట్టిన దానిని వైకాపా ఎమ్మెల్యే , ఎంపీ కూడా ఒక ఉత్తరం అందజేసి పనులు నిలిపివేయడం జరిగింది అని అయన ఆగ్రహం వ్యక్తం చేసారు . ఈ కార్యక్రమంలో అనిశెట్టి సత్యానంద రెడ్డి, స్వామిరెడ్డి రాజులు, స్వామి రెడ్డి వీర గణేష్, వేమాగిరి రాంబాబు, దుళ్ళ సత్తిబాబు, గాది రాజు బాబు, ముడతా రవి బాబు మరియు తదితరులు పాల్గొన్నారు.