టీటీడీ అధికారి “జాటోత్”కు పీ.హెచ్.డీ
** మణిపూర్ యూనివర్సిటీ నుంచి అందజేత
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: తిరుపతిలోని టీటీడీ ప్రింటింగ్ ప్రెస్ లో అడ్మిన్ వింగ్ అసిస్టెంట్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న జాటోత్ భాస్కర్ మణిపూర్ రాష్ట్రంలోని “బీర్తికేంద్రజిత్ యూనివర్సిటీ” నుంచి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగం పార్ట్‌టైం విధానంలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీ.హెచ్.డీ) పట్టాను సాధించారు.
ఆయన “ఎన్ హ్యాన్సింగ్ డిస్టెన్స్ లెర్నింగ్ త్రు డిజిటల్ లైబ్రరీ రిసోర్సస్: ఏ కాంపరేటివ్ స్టడీ ఆఫ్ సెలెక్టెడ్ యూనివర్సిటీస్ ఇన్ ఢిల్లీ ” అనే అంశంపై మూడు సంవత్సరాల పాటు పరిశోధన చేసి, విజయవంతంగా పూర్తి చేశారు.
ఈ పరిశోధన ద్వారా ఢిల్లీలోని ఎంపిక చేసిన విశ్వవిద్యాలయాలలో డిజిటల్ లైబ్రరీ వనరులు దూర విద్యాభ్యాసాన్ని ఎలా బలోపేతం చేస్తున్నాయో తులనాత్మకంగా అధ్యయనం చేశారు. ఇటీవల విశ్వవిద్యాలయం నుండి పీ.హెచ్.డీ ప్రొవిజనల్ సర్టిఫికెట్‌ను అందుకున్నారు. విధి నిర్వహణలో నిబద్ధతతో పాటు ఉన్నత విద్యను కొనసాగిస్తూ పీ.హెచ్.డీ సాధించిన డా.జాటోత్ భాస్కర్‌ను టీటీడీ ఉన్నతాధికారులు, ప్రింటింగ్ ప్రెస్ అధికారులు, సిబ్బంది, టీటీడీ ఎస్సీ- ఎస్టి ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు అభినందించారు. ఆయన సాధించిన ఈ విజయం తోటి ఉద్యోగులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
