వందేమాతర గీతం 150 ఏళ్ల వేడుక
** హాజరైన బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు శుక్రవారం తిరుపతిలోని సరస్వతీ శిశుమందిర్ లో హేమంత్ కుమార్ అధ్యక్షతన ప్రొఫెసర్ కృష్ణారెడ్డి వక్తగా వందేమాతర గీతం 150 సంవత్సరాల ఉత్సవాలలో ముఖ్య అతిథిగా బీజేపీ నేత పి.నవీన్ కుమార్ రెడ్డి హాజరై ప్రసంగించారు. వందేమాతరం నినాదం లేని స్వాతంత్ర ఉద్యమాన్ని ఊహించలేమని, ఆనాడు బ్రిటిష్ వారు 1000 ఫిరంగులు ఎక్కుపెడితే మన భారతీయులు వందేమాతరం అన్న ఒక్క నినాదంతో వెయ్యి ఫిరంగులకు మించిన భయాన్ని బ్రిటిష్ వారి గుండెల్లో పుట్టించారన్నారు.
వందేమాతరం నినాదాన్ని పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు నినదించారని అంత గొప్ప స్ఫూర్తిని, ఉద్యమ కాంక్షను రగిలించిన ఆ శక్తివంతమైన గీతమే మన “జాతీయ గీతం” అవడం భారతీయులందరికీ గర్వకారణం అన్నారు.
1950 జనవరి 24న మన రాజ్యాంగ సభ వందేమాతరం గీతాన్ని “జనగణమన”తో సమానంగా గౌరవిస్తూ జాతీయగీతంగా అధికారికంగా స్వీకరించిందన్నారు.
సూర్యచంద్రులు ఈ సృష్టికి మూలం ఎలాగో జనగణ మన…., వందేమాతరం రెండూ భారతీయులకు గుండె చప్పుడు లాంటిదన్నారు.
వందేమాతరం అన్న గీతంలో జన్మనిచ్చిన తల్లితో పాటు సరస్వతీ, లక్ష్మి, పార్వతి దేవీలను స్తుతిస్తూ భరతమాత ఔన్నత్యాన్ని బెంగాలీ కవి బంకించంద్ చటర్జీ అద్భుతంగా రచించారని పేర్కొన్నారు. దానిని రవీంద్రనాథ్ ఠాగూర్ 1896 లో స్వరకల్పన చేసి జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఆలపించారన్నారు.
వందేమాతరం అనే నినాదం బ్రిటిష్ తెల్లదొరలకు శత్రు నినాదంగా మారిపోయిందని.. భారత దేశ చరిత్రలో వందేమాతరం ఉద్యమం ఒక నూతన శకానికి నాంది పలికిందని నవీన్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రవికుమార్, పాఠశాల కార్యదర్శి తిరుమల శెట్టి రవిశంకర్, చంద్రశేఖర్, ఏం కిరణ్, ప్రొఫెసర్ కీర్తి వెంకయ్య, ప్రొఫెసర్ చక్రవర్తి రాఘవన్, ప్రొఫెసర్ బాలకృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
