శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Sakshitha news

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

సాక్షిత ప్రతినిధి – తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్న బ్రహ్మోత్సవాలకు సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఆగమోక్తంగా పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాలను ఆరంభిస్తున్నట్లు వేదపండితులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, డాలర్స్ దివాకర్ రెడ్డి, పనబాక లక్ష్మీ, సీవీఎస్వో మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.