దుర్గమ్మ సన్నిధిలో ప్రశాంతమ్మ

Sakshitha news

దుర్గమ్మ సన్నిధిలో ప్రశాంతమ్మ

దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే శ్వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గ అమ్మ వారిని దర్శించుకున్నారు. మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి, సవిత తో పాటు ఎమ్మెల్యేలు పరిటాల సునీతమ్మ , గల్లా మాధవి , మిరియాల శిరీష , బండారు శ్రావణిశ్రీ , ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ తో కలిసి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే ప్రశాంతమ్మకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పవిత్ర నవరాత్రుల సందర్బంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్ధి సాధించి సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతమ్మ ఆకాంక్షించారు.