యూరియా కొరతతో జాతీయ రహదారిపై రైతుల ధర్నా
సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో రైతులందరూ జాతీయ రహదారిపై యూరియా సరఫరా కోసం ధర్నాకు దిగారు.రైతులందరికీ సరిపడ యూరియా వెంటనే సరఫరా చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని స్థానిక మార్కెట్ యార్డులో యూరియా సరఫరా కేంద్రాన్ని పరిశీలించిన ఆయన, యూరియా కొరతను నిరసిస్తూ జాతీయ రహదారిపై సిపిఎం, రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా,రాస్తారోకో చేశారు. యూరియాను దిగుమతి చేసుకొని రైతులందరికీ సరిపడ యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
