SAKSHITHA NEWS

తిరుపతి అభివృద్దికి పనులను చేపడుతున్నాము – మేయర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్

రహదారుల విస్తరణతో తిరుపతి అభివృద్ధి – డిప్యూటీ మేయర్ భూమన అభినయ్

తిరుపతి నగరం

తిరుపతి నగరంలో ఎవ్వరూ ఉహించలేనంతగా నూతన రహదారులను తీసుకురావడమే కాకుండా అంతర్గత రోడ్లను విస్తరించి నగరాభివృద్దికి కృషి చేస్తున్నామని టీటీడి చైర్మెన్, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 4 కోట్ల 78 లక్షల వ్యయంతో నిర్మించిన రెండు సిసి రోడ్లను, డ్రైన్లను టీటీడీ చైర్మెన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనగా, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ రెడ్డి, ముద్ర నారాయణలు ప్రారంభించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతో తిరుపతిలో ఒకవైపున అభివృద్ధి, మరోవైపున సంక్షేమంతో దూసుకు పోతున్నదన్నారు. నగరంలో ఇరుకైన రోడ్లలో ప్రయాణించేందుకు వీలు కాలేనటువంటి రహదారులను వెడల్పు మార్గాలుగా తయారుచేసి ప్రజలకు అందించడం జరుగుతున్నదన్నారు.

తిరుపతి నగరంలోని రహదారులకు ఆధ్యాత్మిక వుట్టిపడేలాగా స్వామివారి సేవలో తరించిన మహనీయులు, సేవకుల పేర్లను పెట్టడం జరుగుతున్నని, నేడు కొర్లగుంట రోడ్డును ఎవ్వరూ ఉహించనంతగా విస్తరించిన ఈ రోడ్డుకు తిరుమల ఆలయంలో ఆనంద నిలయాన్ని నిర్మించిన పాలకులు వీర నరసింగ యాదవ రాయ మార్గముగా పేరును పెట్టడం జరిగిందని, అదేవిధంగా మరోక రోడ్డుకు గోదాదేవి స్వామివారిని కీర్తించుతూ రచించిన తిరుప్పావై పేరిట ఆ రోడ్డుకు తిరుప్పావై మార్గముగా పెట్టడం జరిగిందన్నారు. తిరుపతి అభివృద్ధికి మరిన్ని నూతన రహదారులను కూడా తీసుకురావడం జరుగుతుందని టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ మాట్లాడుతూ కొర్లగుంట జంక్షన్ నుండి కొత్తపల్లి జంక్షన్ వరకు 40 అడుగుల మాస్టర్ ప్లాన్ సిసి రోడ్డు, కాలువలను 2 కోట్ల 81 లక్షలతో నిర్మించిన వాటిని ప్రారంభించడం జరిగిందని, అదేవిధంగా కరకంబాడి రోడ్డు హెచ్.పి పెట్రోల్ బంక్ వద్ద నుండి నలందా స్కుల్ వరకు 1 కోటి 97 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డు, కాలువలను ప్రారంభించడం జరిగిందన్నారు. తిరుపతి అభివృద్దికి కావల్సిన అన్ని రకాల చర్యలను కౌన్సిల్ అనుమతితో చేపడుతామని మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ తెలిపారు.

డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ నిరంతరం నగరాభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై ఇటు అధికారులతో అటు ప్రజలతో మమేకమై పనులు చేపడుతున్నామన్నారు. ముఖ్యంగా మాస్టర్ ప్లాన్ రోడ్లు రావడానికి, అంతర్గత రోడ్లు విస్తరణకు సహాయమందించిన ప్రజలకు, అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు అభినయ్ రెడ్డి. భవిష్యత్తులో కూడా మరిన్ని రోడ్లను ఆధునికరించి త్వరలో ప్రారంభిస్తున్నట్టు డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మెన్ కేతం జయచంధ్రా రెడ్డి, కార్పొరేటర్లు పుల్లూరు అమరనాధ రెడ్డి, ఆధం రాధాకృష్ణ రెడ్డి, బోకం అనీల్ కుమార్, తిరుపతి మునిరామిరెడ్డి, శేఖర్ రెడ్డి, దూది కుమారి, కో ఆప్షన్ సభ్యులు వెంకటరెడ్డి, ఇమామ్ సాహేబ్, నాయకులు ఏడిఆర్, దేవదానం, పాముల రమేష్ రెడ్డి, తలారి రాజేంద్ర, నాగిరెడ్డి, దూది శివ, చోటా ఖాసీమ్, సాకం ప్రభాకర్, వెంకటేష్ రాయల్, దినేష్ రాయల్, లవ్లీ వెంకటేశ్వర్లు, గోపాల్ రెడ్డి, గీతాయాదవ్, శాంతారెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మునిసిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, డిఈ సంజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2023 09 15 at 19.19.14

SAKSHITHA NEWS