
అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత్ నగర్ కు చెందిన టిఆర్ఎస్ మహిళా కార్యకర్త వాణి భర్త ఇటీవల అకాల మరణం చెందారు. అలాగే జనప్రియ నగర్ కు చెందిన మాజీ ఎస్టీ సెల్ అధ్యక్షులు గోపాల్ నాయక్ ఇటీ వల రోడ్డు ప్రమాదంలో గాయాలు కాగా కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ మరియు మేడ్చల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ గౌసుదీన్ డివిజన్ లోని నాయకులతో కలిసి వారి ఇంటి వద్దకు వెళ్లి పరామర్శించడం జరిగింది.
