స్థాన చలనం లేకుండా పని చేస్తున్న పోలీసులను,ప్రభుత్వ ఉద్యోగులను బదిలీ చేయాలని కలెక్టర్,ఆర్డీవోకు వినతి పత్రం
వచ్చే ఎన్నికల్లో అధికారుల స్థానచలం లేకుండా ఉంటే అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారు
పోలీస్ అధికారులను ప్రజాస్వామ్య బద్దంగా బదిలీ చేయకపోతే ఎన్నికల కమిషన్ ను ఫిర్యాదు చేస్తాం
ఎన్నికల సమయంలో అధికారులను బదిలీ చేయకపోవడం దేనికి సంకేతం
ఎన్నికల సమయం నాటికి ప్రభుత్వ ఉద్యోగులందరినీ బదిలీ చేయాలి
-నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు
నరసరావుపేట నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాలుగా స్థాన చలనం లేకుండా పని చేస్తున్న పోలీస్ అధికారులు,ప్రభుత్వ ఉద్యోగులను బదిలీ చేయాలని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-చార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు పల్నాడు జిల్లా కలెక్టర్,ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు.గత కొన్ని సంవత్సరాలుగా బదిలీలు లేకుండా పని చేస్తున్న అధికారుల వివరాలను కలెక్టర్,ఆర్డీవోలకు సమర్పించి వారిని బదిలీ చేయాలని డా౹౹చదలవాడ అరవింద బాబు కలెక్టర్ ను కోరారు.ఎన్నికలు దగ్గర పడుతున్నాయని వచ్చే ఎన్నికల సమయానికి పోలీస్ అధికారులను, ప్రభుత్వ ఉద్యోగులను బదిలీ చేయాలని లేకపోతే వారు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారని డా౹౹చదలవాడ అరవింద బాబు ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోలీస్ అధికారులను ప్రజాస్వామ్య బద్దంగా,ఎన్నికల నియమావళిని అనుసరించి బదిలీ చేయాలని అలా బదిలీ చేయకపోతే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని డా౹౹చదలవాడ అరవింద బాబు అధికారులను హెచ్చరించారు.ఎన్నికల సమయం నాటికి అన్ని ప్రభుత్వ శాఖల్లో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులను బదిలీ చేయాలని ఎన్నికల నియమావళి చెప్తుంటే నరసరావుపేటలో సంవత్సరాల తరబడి స్థానా చలనం లేకుండా పని చేస్తున్న పోలీస్ అధికారులను మార్చకపోవడం దేనికి సంకేతమన్నారు.ఎన్నికల సమయం నాటికి ప్రభుత్వ ఉద్యోగులందరినీ బదిలీ చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి వేల్పుల సింహాద్రి యాదవ్,మాజీ ఎంపీపీ కడియం కోటి సుబ్బారావు,మాజీ కౌన్సిలర్ కొవ్వూరి బాబు,తెలుగు యువత నాయకులు శాఖమూరి మారుతి,షేక్ నాగూర్,చల్లగుండ్ల హరికృష్ణ,నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు షేక్ మాబు,వార్డ్ ప్రెసిడెంట్ బాషా తదితరులు పాల్గొన్నారు.