ప్రజల జీవితాలలో వెలుగు నింపే దిశగా
సత్య ప్రచారక్ సమాజ్ పయనం సాగాలి.
కవి, రచయిత, సీనియర్ జర్నలిస్టు మోహన్ బైరాగి నేతృత్వంలో ప్రారంభం అయిన సత్య ప్రచారక్ సమాజ్
డిజిటల్ మీడియా వెబ్సైట్ ను సి పి ఐ రాష్ర్ట కార్యదర్శి, కొత్త గూడెం నియోజకవర్గ శాసన సభ్యులు కూానంనేని సాంబశివరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు.. ప్రస్తుత సమాజం లో మనువాదులు పెట్టుబడిదారులు,సామ్రాజ్యవాదులు చేస్తున్న అబద్ధాలను, అసత్య ప్రచారాలను ఎండగడుతూ, బట్టబయలు చేస్తూ, నిజాలను నిగ్గు తేల్చుతూ సత్యాన్వేషణ చేస్తూ,ప్రజల జీవితాలలో వెలుగులు నింపే దిశగా ప్రయాణం సాగించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు
.రాజకీయ పార్టీలు అధికారమే పరమావధిగా మతం పేరుతో అబద్ధాలను ప్రచారం చేస్తుంటే యువకులు నిజాలు తెలుసుకోకపోవడం వల్ల భవిష్యత్తు తరాలకు అబద్ధమే ప్రచారమయ్యే ప్రమాదం ఉందని కావున సత్యప్రచారక్ సమాజ్ నిజాలను ప్రచారం చెయ్యడానికి పూనుకోవడం మంచి ప్రయత్నమని తెలిపారు.
హిమాయత్ నగర్ సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూమ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కెలపల్లి శ్రీనివాస్ రావు,బాలమల్లేశ్,రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్య పద్మ,భాగం హేమంత్ రావ్,సీపీఐ మేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి ఉమా మహేష్, సీనియర్ జర్నలిస్ట్ బాలరాజ్ పాల్గొన్నారు.