తిరుపతి నగరంలో ఎన్నికల ఓటర్ల జాబితాలో చేర్చేందుకు వచ్చిన కొత్త ఓట్లు ధరఖాస్తూలను క్షుణ్ణంగా పరిశీలించాలని తిరుపతి ఓటర్ నమోదు అధికారి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. తిరుపతి నియోజకవర్గంలో ఓటర్ల నమోదు కొరకు వచ్చిన ధరఖాస్తులపై బూత్ లెవల్ అధికారులతో తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ హరిత ఐఏఎస్ మాట్లాడుతూ కొత్త ఓట్ల నమోదు కోసం వచ్చిన ధరఖాస్తుల్లోని అన్ని అంశాలను పరిశీలించాలని, 18 సంవత్సరాలు నిండిన వారిని మాత్రమే పరిశీలనలోకి తీసుకోవాలని, వయస్సును దృవికరించే పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.
అదేవిధంగా చనిపోయిన వారిని ఓటర్ల జాబితా నుండి తీసివేసేటప్పుడు, చనిపోయిన వ్యక్తి మృతిని నిర్ధారించుకొనే ఆధారాలను పరిశీలించి రెపర్ చేయవలెనని తెలిపారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు, పొరబాట్లు జరిగితే చట్టపరమైన చర్యలను అందరూ ఎదుర్కోనవల్సి వస్తుందనన్నారు. తిరుపతి నియోజకవర్గంలో ఓటర్ల జాబితాను సిద్ధం చేసేటప్పుడు పొరబాట్లకు తావు లేకుండా సిద్ధం చేయాలని తిరుపతి నియోజకవర్గం ఓటర్ నమోదు అధికారి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ తెలిపారు. ఈ సమావేశంలో తిరుపతి నియోజకవర్గం ఓటర్ల నమోదు అదనపు అధికారులు డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళిశ్వర్ రెడ్డి, స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, అర్బన్ ఎమ్మార్వో వెంకటరమణ, బి.ఎల్వోలు పాల్గొన్నారు.