SAKSHITHA NEWS

WhatsApp Image 2023 07 19 at 6.46.02 PM

సాక్షిత : తిరుపతి నియోజకవర్గం పరిధిలోని ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా పక్కగా ఉండేలా సిద్ధం చేయాలని తిరుపతి అసెంబ్లీ ఓటర్ నమోదు అధికారి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. తిరుపతి నియోజక వర్గ ఓటర్ల జాబితాపై ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్లో జరిగిన సమావేశములో ఎన్నికల అధికారులు, బూత్ లెవెల్ అధికారులతో కమిషనర్ హరిత సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి ఓటరుని క్షుణ్ణంగా పరిశీలించి కొత్త ఓటర్ల చేర్పులు, మరణించిన వారి ఓట్ల తొలగింపు తదితర విషయాల్లో క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఇంటింటి సర్వేలో భాగంగా ఒక చోట నుండి మరో చోటుకు మారిన ఓటర్ల ఇంటికి ఒకటికి రెండుసార్లు వెళ్ళి సరి చూసుకోవాలన్నారు. ఓటర్ల జాబితా తయారీలో ఎటువంటి అభియోగాలు లేకుండా పక్కగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని, అందరూ జాగ్రత్తగా పనిచేయాలని తిరుపతి నియోజకవర్గం ఓటర్ నమోదు అధికారి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ సూచించారు. ఈ సమావేశంలో తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, అర్బన్ ఎమ్మార్వో వెంకటరమణ, డిటి జీవన్ తదితరులు పాల్గొన్నారు.*


SAKSHITHA NEWS