గణేష్ నిమజ్జన ప్రాంతాల్లో పటిష్టమైన భద్రత ఏర్పాటు

Spread the love

జిల్లాలో గణేష్ నిమజ్జన ప్రాంతాల్లో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలి.
కొత్తపట్నం తీర ప్రాంతంలో నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను స్వయంగా పరిశీలించిన
నిమజ్జన సమయంలో ఎలాంటి అపశ్రుతులు, అవాంతరాలు తలెత్తకుండా నిరంతర అప్రమత్తతో విధులు నిర్వర్తించాలి
ప్రశాంత వాతావరణంలో సురక్షిత వినాయక నిమజ్జనంకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్

ప్రకాశం జిల్లా ఒంగోలు వినాయక చవితి అనంతరం జిల్లాలో ఎక్కువ సంఖ్యలో గణేష్ విగ్రహ నిమజ్జనాలు జరిగే కొత్తపట్నం తీరంలో నిమజ్జనాలు జరిగే ప్రాంతాలను బుధవారం జిల్లా ఎస్పీ సందర్శించి అక్కడ చేపట్టిన భద్రతా బందోబస్త్ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. నిమజ్జన సమయాల్లో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా సజావుగా సాగిపోయేందుకు బీచ్ లోని పలు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రత్యేక ఏర్పాట్లపై పోలీసు అధికారులకు పలు సూచనలు తెలియచేసారు. గణేష్ విగ్రహాల నిమజ్జనాలలో ఎలాంటి అపశ్రుతులు, అవాంతరాలు, ప్రమాదాలు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, నిమజ్జనం యాత్ర జరిగే రహదారులు, కూడళ్ల వద్ద బందోబస్తుతో ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా నిర్దేశిత సమయాల్లోనే నిమజ్జనాలు పూర్తి జరిగేలా చూడాలని, నిమజ్జనం ప్రాంతంలో భక్తులు, పిల్లలు, వృద్ధులు ఎవరూ కూడా సముద్రం లోతు ప్రాంతాల్లోకి వెళ్లకుండా చూడాలని, గజ ఈతగాళ్లు, ఫ్లడ్ లైట్లు, లైఫ్ జాకెట్లు, నాటు పడవలు మొదలైనవి సిద్ధంగా ఉండేటట్టు చర్యలు తీసుకోని నిరంతర అప్రమత్తతో విధులు నిర్వర్తించాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు.

Related Posts

You cannot copy content of this page