తెలంగాణ కేబినెట్ విస్తరణ..రేసులో ఉంది వీరే!
తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. ఎప్పుడెప్పుడు అని ఊరిస్తున్న కేబినెట్ విస్తరణ ఈ నెలలోనే ఉండనుందని తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో పాటు నూతన పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఢిల్లీలో ఉండటంతో ఉహాగానాలు జోరందుకున్నాయి.
ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11మంది మంత్రులు ఉన్నారు. కొత్తగా కేబినెట్ లో చేరేందుకు మరో ఆరుగురికి ఛాన్స్ ఉండగా దీంతో ఆశావాహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. అయితే ఈసారి మంత్రివర్గ విస్తరణలో ప్రధానంగా ప్రాతినిధ్యం దక్కని జిల్లాలతో పాటు సామాజికవర్గ ప్రాతిపదికన ఉండే అవకాశం ఉంది.
కేబినెట్ లో హైదరాబాద్, అదిలాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుండి ప్రాతినిధ్యం లేకపోవడంతో ఖచ్చితంగా ఛాన్స్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం దక్కనుండగా ప్రధానంగా రంగారెడ్డి జిల్లా నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి రే, ఆదిలాబాద్ జిల్లా నుంచి వివేక్ సోదరులు, ప్రేమ్ సాగర్ రావు, నిజామాబాద్ లో సుదర్శన్ రెడ్డికి దాదాపుగా బెర్త్ కన్ఫార్మ్ అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి దానం నాగేందర్ ,ల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలూనాయక్ పేర్లు వినిపిస్తుండగా ఎవరిని అదృష్టం వరిస్తుందో వేచిచూడాలి.