SAKSHITHA NEWS

శ్రీ కోదండ రామాలయంలో వార్షిక ధనుర్మాస ఉత్సవాల…. అన్న సమారాధన ప్రారంభించిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

వేద పండితులు ఆశీస్సులు అందుకున్న ఎమ్మెల్యే…

స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలి…

అన్నదానం భగవంతుడు మెచ్చే కార్యక్రమం…

గుడివాడ జనవరి 17: శ్రీ కోదండ రామస్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ, సుఖ సంతోషాలతో జీవించాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆకాంక్షించారు.

గుడివాడ పట్టణం ఓల్డ్ మున్సిపల్ కార్యాలయం వద్ద గల శ్రీ కోదండ రామాలయంలో 80వ వార్షిక ధనుర్మాత్సవాలు వైభవోపేతంగా ముగియడంతో… శాంతి నిమిత్తం శుక్రవారం నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రారంభించారు.

ముందుగా శ్రీ కోదండ రామచంద్రస్వామి వారికి, అన్నదాన మహా కుంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన… ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు వేద పండితులు వేద ఆశీస్సులు అందించి…. అన్న సమారాధన ప్రసాదాన్ని అందచేశారు.

అనంతరం దేవస్థానం కమిటీ పెద్దలతో కలిసి… ప్రజలకు సమారాధన ఆహారాన్ని ఎమ్మెల్యే వడ్డించారు.

అన్ని దానలకెల్లా అన్నదానం గొప్పదని, దైవ కార్యక్రమంలో అన్నదానం చేయడం భగవంతుడు మెచ్చే కార్యక్రమమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము అన్నారు. గత 80 ఏళ్లుగా దేవస్థానంలో ఎంతో వైభవంగా జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాల ముగింపు అన్న సమారాధనలో పాల్గొనడం సంతోషంగా ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. శ్రీ కోదండ రామచంద్రస్వామి వారి దీవెనలు కూటమి ప్రభుత్వం, రాష్ట్ర ప్రజానీకంపై ఉండాలని ఎమ్మెల్యే రాము ఆకాంక్షించారు.

పదివేల మందికి నేడు సమారాధన ఏర్పాట్లు చేశామని దేవస్థాన కమిటీ పెద్దలు తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీ కోదండ రామాలయ కమిటీ అధ్యక్షుడు డొక్కు రాంబాబు, మున్సిపల్ మాజీ చైర్మన్ లంకదాసరి ప్రసాదరావు, మాజీ ఎంపీపీ గుత్తా చంటి, టిడిపి నాయకులు కడియాల గణేష్, చేకూరు జగన్మోహన్రావు, సయ్యద్ గఫార్, దేవస్థాన కమిటీ పెద్దలు రాయపురెడ్డి రాజేంద్ర ప్రసాద్, దారపురెడ్డి వెంకన్న, మెరుగుమోల రామకృష్ణ, సీతారామయ్య, పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.