బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ కు మానవ సంబంధాలు కాదు.. మనీ సంబంధాలే ముఖ్యమని దుయ్యబట్టారు. గతంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని తన బిడ్డ పెళ్లిని చూడకుండా చేశాడని గుర్తు చేశాడు. కేసీఆర్ కుటుంబ విలువలు తెలుసుకోవాలన్నారు.
తెలంగాణలో నిరుద్యోగం తప్పా ఇంకేమి లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై లాఠీ చార్జ్ చేసిన మూర్ఖుడు కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ రాష్ట్ర ప్రజలను దోచుకుంటున్నాడని విమర్శించారు. తనపై కావాలానే కేసు పెట్టారని చెప్పారు.
రాత్రి 12:30 గంటలకు ఉప్పల్ నుంచి మెట్రో రైలు..
తన ఫోన్ ను ఎవరు ఎత్తుకు పోయారని చెప్పారు. పోలీసులే తన మొబైల్ దొంగిలించారని ఆరోపించారు. ప్రశాంత్ వాట్సాప్ చేస్తే తాను సాయంత్రం 5 గంటలకు చూసుకున్నట్లు బండి సంజయ్ తెలిపారు. పరీక్ష మధ్యాహ్నం 12:30 గంటలకే అయిపోయిందన్నారు.
అటు హనుమకొండ సీపీ రంగనాథ్ పై కూడా బండి సంజయ్ విరుచుకుపడ్డారు. రంగనాథ్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. రంగనాథ్ విజయవాడ, ఖమ్మం, వరంగల్ లో ఏ దందాలు చేశాడో తెలుసన్నారు. వాటన్నింటిని బయటకు తీసుకొస్తామని హెచ్చరించారు.