దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన తెలంగాణ మహిళా కాంగ్రెస్: రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు జ్యోతి బీమ్ భరత్
సాక్షిత శంకర్‌పల్లి: రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్ 30 వేల సభ్యత్వాలను పూర్తి చేసిందని రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు జ్యోతి బీమ్ భరత్ స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడుతూ సుమారు 30వేల పైచిలుకు సభ్యత్వాలు నమోదు చేయడం పట్ల ఆమె మండలాల మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లను అభినందించారు. జిల్లాలోని అన్ని మండలాలలో మహిళా కాంగ్రెస్ పటిష్టంగా ఉందన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మహిళా నేతలంతా సమరోత్సహంతో ముందుకు సాగారని అభినందిం చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు నుంచి మహిళా కాంగ్రెస్ చురుకైన పాత్ర పోషిస్తుందన్నారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఎన్నో పోరాటాలు నిర్వహించామని ఆమె చెప్పారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవలంభిస్తున్న మహిళా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. పార్టీ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ కర్గే, ప్రధాన కార్యదర్శి కేసి.
వేణుగోపాల్, మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కా లాంబా, రాష్ట్ర అధ్యక్షురాలు మొగిలి సునీత రావు జిల్లాలో మహిళా కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రశంసించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని, దీనికి నిదర్శనమే సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 6 గ్యారంటీ పథకాలని తెలిపారు. సభ్యత్వ నమోదుకు సహకరించిన రంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు జయమ్మ, యూత్ కాంగ్రెస్ నాయకులకు జ్యోతి బీమ్ భరత్ కృతజ్ఞతలు తెలిపారు.