మొదటి సల్ఫా ఔషధాన్ని కనుగొన్న శాస్త్రవేత్త
గెర్ హర్డ్ డొమాక్ సేవలు చిరస్మరణీయం*
కరోనా కొత్త వేరియంట్ పట్ల ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలి
డోన్ ప్రభుత్వ వైద్యశాల సూపరిండెంట్ ఎస్. మహమ్మద్ హనీఫ్
సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి
ఏప్రిల్ 24 న మొదటి సల్ఫా ఔషధాన్ని కనుగొన్న శాస్త్రవేత్త (GERHARD DOMAGK) గెర్హార్డ్ డొమాక్ వర్థంతి సందర్భంగా
డోన్ పట్టణంలో ప్రభుత్వ వైద్యశాల నందు
సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆద్వర్యంలో ప్రభుత్వ వైద్యశాల సూపరిండెంట్ డాక్టర్ ఎస్. మహమ్మద్ హనీఫ్ అధ్యక్షతన మొదటి సల్ఫా ఔషధాన్ని కనుగొన్న శాస్త్రవేత్త శ్రీ గెర్ హర్డ్ డొమాక్ (GERHARD DOMAGK)గారి వర్థంతి సందర్బంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘణంగా నివాళి అర్పించారు. వారిని స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ డి.ఆర్. కె. రెడ్డి, డాక్టర్ ముజాంవలి, డాక్టర్ కళ్యాణ్ బాబు, డాక్టర్ గౌస్, డాక్టర్ జార్జ్ వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్బంగా డోన్ ప్రభుత్వ వైద్యశాల సూపరిండెంట్ ఎస్. మహమ్మద్ హనీఫ్, సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి మాట్లడుతూ
మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని డోన్ ప్రభుత్వ వైద్యశాల సూపరిండెంట్ ఎస్. మహమ్మద్ హనీఫ్, సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి కోరారు
గెర్హార్డ్ డొమాగ్ అక్టోబర్ 30, 1895 జన్మించారు. ఈయన జర్మన్ బ్యాక్టీరియాలజిస్ట్ మరియు రోగనిర్ధారణ శాస్త్రజ్ఞుడు. 1935లో గెర్‌హార్డ్ డొమాగ్ సల్ఫోనా మైడ్‌లు ప్రవేశపెట్టారు. ఇవన్నీ సల్ఫానిలమైడ్ సమ్మేళనానికి సంబంధించినవి. అనేక బ్యాక్టీరియా వ్యాధులకు మొదటి విజయవంతమైన చికిత్సలను అందించాయి.
అలాగే వారు యాంటీబయాటిక్స్‌కు ఆద్యులుగా నిరూపించబడ్డారు. ఈయన నోబెల్ ప్రియోలజీ అవార్డును అందుకున్నాడు. డోమాగ్ ఏప్రిల్ 24, 1964 స్వర్గస్తులైనారు.ఈలాంటి మహనీయులను అనుక్షణం స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని డోన్ ప్రభుత్వ వైద్యశాల సూపరిండెంట్ ఎస్. మహమ్మద్ హనీఫ్, సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి కోరారు.
కరోనా కొత్త వేరియంట్ పట్ల ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలి
దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో
ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మరిన్ని జాగ్రత్తలతో మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించడం, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవడంతో
పాటు జన సమూహలకు దూరంగా ఉంటూ ఇమ్యూనిటీ పెంచే ఆహారం తీసుకుంటూ
ఆరోగ్యాలను కాపాడుకోవాలని డోన్ ప్రభుత్వ వైద్యశాల సూపరిండెంట్ ఎస్. మహమ్మద్ హనీఫ్,
సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి
తెలిపారు.