ఎస్సి వర్గీకరణ బిల్లు పార్లమెంట్ లో ప్రెవేశపెట్టి చట్టబద్దత కల్పించాలి

ఎస్సి వర్గీకరణ బిల్లు పార్లమెంట్ లో ప్రెవేశపెట్టి చట్టబద్దత కల్పించాలి

SAKSHITHA NEWS

ఎస్సి వర్గీకరణ బిల్లు పార్లమెంట్ లో ప్రెవేశపెట్టి చట్టబద్దత కల్పించాలి : రంగారెడ్డి జిల్లా మాజీ డిసిసి అధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, పెద్దలు,
కె.యం.ప్రతాప్

ఎస్సి రేజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మేడ్చెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిలువేరు శ్రీనివాస్ మాదిగ ఆధ్వర్యంలో, మున్సిపల్ చౌరస్తా లో, ఏర్పాటు చేసిన దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించిన రంగారెడ్డి జిల్లా మాజీ డిసిసి అధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, పెద్దలు,
కె.యం.ప్రతాప్ .
ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ,
ఎస్సి వర్గీకరణ న్యాయమైన డిమాండ్, దానిని తక్షణమే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు పెట్టి,మాదిగలకు న్యాయం చేయాలనీ డిమాండ్ చేసారు.

వర్గీకరణ కోసం మాదిగల పోరాటం తెలుగు నేలపైన ముప్పై సంవత్సరాలుగా నడుస్తుంది,
మంద కృష్ణ మాదిగ,
ఎన్ని ఆటంకాలు ఎదురైనా పోరాటాన్ని వీడకుండా ముందుకు సాగుతున్నారు. మాదిగల పోరాటానికి ఎల్లపుడు అందుబాటులో ఉంటానన్నారు.

ఈ కార్యక్రమములో మాదిగ స్టూడెంట్ జాతీయ ఉపాధ్యక్షులు తోకల చిరంజీవి మాదిగ, MRPS కుతుబుల్లాపూర్ అధ్యక్షులు రసమళ్ళ యాదగిరి మాదిగ, కాంగ్రెస్ నాయుకులు జెస్సి పాల్,ఇస్రం రమేష్, సలోమి,ఎస్తేరు రాణి, మట్ట నరసింహ, జాన్, త్రినేత్ర మాదిగ వినోద్, వినయ్, ఈశ్వర్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2023 09 15 at 15.11.22

SAKSHITHA NEWS