సాక్షిత : ఎందరో మహానీయుల పోరాట ఫలితంగానే భారత దేశానికి స్వాతంత్రం లభించిందని, దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం
జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 36 లోని ఫ్రీడమ్ పార్క్ లో స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజ్యసభ సభ్యులు K. కేశవరావు, MLA దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి, GHMC కమిషనర్ లోకేష్ కుమార్ లు మొక్కలను నాటారు. ఈ సందర్భంగా
మంత్రి మాట్లాడుతూ
దేశానికి స్వాతంత్రం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి KCR గారి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో 15 రోజుల పాటు వజ్రోత్సవ వేడుకలను నిర్వహిస్తుందని చెప్పారు. అందులో భాగంగా నగరంలోని 75 ప్రాంతాలలో ఫ్రీడమ్ పార్క్ లను ఏర్పాటు చేసి మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టడం జరిగిందని వివరించారు. విరివిగా మొక్కలను నాటడం వలన పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం జరుగుతుందని వివరించారు.
అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మాగాంధీ అని పేర్కొన్నారు. మహాత్మాగాంధీ గురించి విద్యార్థుల కు తెలియజెప్పేందుకు రాష్ట్రంలోని 563 స్క్రీన్ లలో ఉచితంగా గాంధీ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. దేశ సమైక్యతను చాటి చెప్పే విధంగా
ప్రతి ఇంటిపై జాతీయ పతాకాలను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. 16 వ తేదీన నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాపన లో పాల్గొనాలని కోరారు.
ఎందరో మహానీయుల పోరాట ఫలితంగానే భారత దేశానికి స్వాతంత్రం
Related Posts
స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మాజీమంత్రి తలసాని
SAKSHITHA NEWS స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మాజీమంత్రి తలసాని వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ని దర్శించుకున్నారు. భువనగిరి వద్దగల ఆలయానికి చేరుకొని స్వామి…
సన ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు..
SAKSHITHA NEWS సన ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు.. సాక్షిత ప్రతినిధి కోదాడ సూర్యాపేట జిల్లా)కోదాడ పట్టణంలోని సన ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలను ముందస్తుగా ఘనంగా నిర్వహించారు. కనుమరుగైపోతున్న వివిధ పండుగల విశిష్టతను భారత గ్రామీణ సాంప్రదాయాలను నేటి తరం…