SAKSHITHA NEWS

శ్రీరామ నవమి సందర్భంగా దైవ దర్శనం చేసుకున్న పోలీసులు

సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : ఆదివారం శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా సూర్యాపేట మండలం పరిధిలోని గ్రామాల్లో దేవాలయాలవద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సూర్యాపేట రూరల్ పోలీసులు పెట్రోలింగ్ లో తిరుగుతూ దేవాలయాలవద్ద పరిస్థితిని పర్యవేక్షించడానికి మున్సిపాలిటీ పరిధి లోని పిల్లలమర్రి , రాయినిగూడెం గ్రామాలతో పాటు టేకుమట్ల శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవాలయాలను సందర్శించిన పోలీసులు టేకుమట్ల దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ పరిసర ప్రాంతాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించుకోవాలని ఆయా దేవాలయ కమిటీ సభ్యులకు తెలియజేశారు.