SAKSHITHA NEWS

The ongoing severe depression in the Bay of Bengal.

విశాఖపట్నం

పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి అనుకొని ఉన్న దక్షిణ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.

ఇది ఈశాన్య దిశగా కదులుతూ మరి ఈరోజు ఉదయం వాయుగుండంగా మారే అవకాశం.

ఇది ఈశాన్య దిశగా కదులుతూ తూర్పు మధ్య బంగాళాఖాతంలో (25వ తేది) రేపు ఉదయానికి తుఫాన్ గా మారే సూచనలు.

ఇది ఉత్తర దిశగా కదులుతూ (26వ తేదీ) ఎల్లుండి సాయంత్రానికి పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరం వద్ద తీవ్ర తుఫానుగా మారే సూచనలు

తుఫాన్ కు రీమెల్ అని నామకరణం

ఈనెల 26 న పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ ల మధ్య తీరం దాటే అవకాశం

మే 26 మరియు 27 తేదీల్లో పశ్చిమ బెంగాల్‌లోని తీరప్రాంత జిల్లాలు,
ఉత్తర ఒడిశాలోని పరిసర జిల్లాలపై వివిధ ప్రదేశాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు..

చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మే 26, 27 తేదీల్లో మిజోరం, త్రిపుర మరియు దక్షిణ మణిపూర్‌లలో వివిధ ప్రదేశాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది

నేడు మధ్య బంగాళాఖాతం మీదుగా గంటకు 50-60 కి.మీ నుండి 70 కి.మీ వేగంతో గాలులు..

మే 25 ఉదయం నుండి గంటకు 60-70 కి.మీ వేగంతో 80 కి.మీ వేగంతో గాలులు,

తదుపరి ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాలకు విస్తరించనున్న గాలులు.

WhatsApp Image 2024 05 24 at 15.52.19

SAKSHITHA NEWS