
నల్లమల అటవీ ప్రాంతంలో పెరుగుతోన్న పులుల సంఖ్య
ఏపీలో నల్లమల అటవీ ప్రాంతంలోని నాగార్జున సాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వు (NSTR) ప్రాంతంలో పులుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఈ అభయారణ్యంలో 2023లో 74 పులులు ఉండగా.. 2024లో వాటి సంఖ్య 76కు చేరిందని అటవీశాఖ అధికారులు లెక్కగట్టారు. వీటిలో 40 ఆడ పులులు కాగా.. 32 మగవి అని చెప్పారు. మరో నాలుగింటి జెండర్ గుర్తించలేకపోయారు. అలాగే వీటితో పాటు మరో 11 పులి కూనలూ ఉన్నట్లు వివరించారు.
