SAKSHITHA NEWS

సాధారణ కాన్పుల సంఖ్య పెంచాలి -ప్రతి గర్భవతి ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవించాలి
సాక్షిత ప్రతినిధి.
ప్రభుత్వాసుపత్రి నుండి బయటికి రిఫర్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాంజిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కే సుధాకర్ లాల్
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఉప వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లకు మరియు పర్యవేక్షణ సిబ్బందికి సమీక్ష సమావేశం నిర్వహించారు. డాక్టర్ కే సుధాకర్ లాల్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ కల్వకుర్తి ప్రభుత్వ హాస్పిటల్ పై ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయని ప్రభుత్వ డాక్టర్లు సమయపాలన పాటించాలని ప్రభుత్వాసులకు వచ్చే వారిని గౌరవించాలని ప్రతి కాన్పు ప్రభుత్వ ఆసుపత్రిలో జరగాలని, సాధారణ కాన్పుల సంఖ్య పెంచాలని సూచించారు. ప్రస్తుతం జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో 75% కాన్పులు, ఆసుపత్రిలో 25% కాన్పులు జరుగుతున్నాయని తెలియజేశారు. ఇంకా ప్రతి కాన్పు ప్రభుత్వ ఆసుపత్రిలో చేసే విధంగా కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని వైద్యాధికారులకు సూచించారు.

అదేవిధంగా ఆసుపత్రులలో వారు నిర్వహించే సేవల ధరల పట్టికను ఆసుపత్రి ఆవరణలో ప్రదర్శించాలని , అధిక ధరలు వసూలు చేసినచో ఆస్పత్రి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశించారు.

ప్రతి నెల జిల్లా యందు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్పత్రిలో నిర్వహించి చికిత్స కాన్పులపై ఆడిట్ నిర్వహిస్తామని తెలియజేశారు .

ప్రతి గ్రామంలో కంటి వెలుగు క్యాంపులు నిర్వహిస్తున్నామని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈరోజు ఆకస్మికంగా కల్వకుర్తి పట్టణములొ పాత గ్రామపంచాయతీ ఆఫీస్ లో నిర్వహించిన కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించి పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ శివరాం, గైనకాలజిస్ట్ డాక్టర్ విజయ్ కుమార్, డిప్యూటీ డియం హెచ్ ఒ డాక్టర్ కృష్ణ , జిల్లా మాస్ మీడియా అధికారి నరసింహ , కల్వకుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు, ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు , మరియు డివిజనల్ వైద్య సిబ్బంది మరియు పర్యవేక్షకులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS