నందిగామ నగర జాతీయ జెండా రెపరెపలాడుతోంది. ఇప్పటికే నందిగామ గాంధీ సెంటర్లో లింకా బుక్ ఆఫ్ రికార్డుల్లో ఎక్కిన మహాత్మా గాంధీ అరుదైన విగ్రహాన్ని ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ లు దాతల సహాయ సహకారాలతో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో గాంధీ సెంటర్ నూతన శోభను సంతరించుకుంది. నందిగామ గాంధీ సెంటర్ లో నుంచి ప్రయాణించే ప్రతి ఒక్కరు ఆగి మహాత్మా గాంధీ విగ్రహాన్ని, జాతీయ జెండాను చూసి అబ్బురపడుతున్నారు. గాంధీ సెంటర్లో విగ్రహాల తొలగింపు నుండి ఒకరి వరుసలో విగ్రహాల నూతనంగా ఏర్పాటు చేసే విషయం వరకు ప్రతిపక్ష పార్టీ నాయకులు హైకోర్టుకు వెళ్లి స్టే తీసుకురావడం లాంటి చర్యలు చేపట్టినప్పటికీ మొక్కవోని దీక్షతో సెంటర్లో అడ్డుగా ఉన్న విగ్రహాలను తొలగించి లీడర్స్ పార్కు ఏర్పాటు చేయడం వల్ల గాంధీ సెంటర్ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం ఏర్పడింది. నాలుగు రోడ్ల కూడలిలో చిన్న రింగ్ ఏర్పాటు చేసి అందులో మహాత్మా గాంధీ విగ్రహం జాతీయ జెండాను ఫ్లడ్ లైట్స్ నడుమ ఏర్పాటు చేయడం వల్ల నందిగామ గాంధీ సెంటర్ నూతన శోభ సంతరించుకుంది. వారం రోజుల్లోనే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన అధికారులకు పట్టణ ప్రజలు నియోజకవర్గ ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు.
జాతీయ జెండా రెపరెపలాడుతోంది
Related Posts
టొయోటాను ఆదరించాలి.
SAKSHITHA NEWS టొయోటాను ఆదరించాలి.పెద్దపాడులో మోడి టొయోటా గ్రామీణ మహోత్సవంప్రారంభించిన ఎమ్మెల్యే గొండు శంకర్శ్రీకాకుళంటొయోటా కార్లు అన్ని వర్గాల ప్రజలకు తక్కువ ధరకు అందిస్తూ నాణ్యతలో మంచి ప్రమాణాలు పాటిస్తున్నాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. మండలంలోని పెద్దపాడులోని రామిగెడ్డ…
విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చరిత్ర: సీఎం చంద్రబాబు
SAKSHITHA NEWS విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చరిత్ర: సీఎం చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చరిత్ర: సీఎం చంద్రబాబుఆంధ్రప్రదేశ్ : స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల ఒక చరిత్ర అని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ…