SAKSHITHA NEWS





The MLA participated in the funeral of the son of a senior BRS party leader

బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుని కుమారుడి అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సూరారం 129 డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, TSCPWA స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ హుస్సేన్ కుమారుడు హఠాన్మరణం చెందడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్ వారి నివాసానికి వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించారు.

కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యాన్నిచ్చారు. అనంతరం అంత్యక్రియల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ యూత్ ప్రెసిడెంట్, దుండిగల్ పార్టీ ప్రెసిడెంట్, డివిజన్ ప్రెసిడెంట్లు, సీనియర్ నాయకులు, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS