SAKSHITHA NEWS

కునికినపాడు గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం” కార్యక్రమం నిర్వహించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..


సాక్షిత నందిగామ నియోజకవర్గం :*జగనన్నకే ప్రజా మద్దతు.. మరోసారి రానున్నది జగన్ ప్రభుత్వమే : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

గత ప్రభుత్వాల పాలనలో ఏ ఎమ్మెల్యే కూడా ఈ విధంగా ప్రతి గడప తిరిగినా దాఖలు లేవు : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

కంచికచర్ల మండలంలోని “కునికినపాడు” గ్రామంలో గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఉదయం ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల బుక్ లెట్ లను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ప్రజలకు అందజేశారు ..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. జగనన్న పాలనలో ప్రజలంతా సంతోషంగా జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా వాలంటీర్, సచివాలయ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలకు అర్హులను గుర్తించి, వారి ఇళ్ల వద్దకే వెళ్లి పథకాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. గత ప్రభుత్వాల పాలనలో ఎమ్మెల్యేగా గెలిచిన ఏ ప్రజాప్రతినిధి కూడా అధికారంలో ఉండగా ప్రతి గడపకు వెళ్లి ప్రజలను పలకరించిన దాఖలాలు లేవని.. కేవలం ఎన్నికల అప్పుడు మాత్రమే ప్రజల ముందుకు వెళ్లే వారిని.. ఆ విధానానికి వైయస్ జగన్ స్వస్తి పలికారన్నారు. ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకుని.. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పాలన తీరును వారికి వివరించి.. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసే విధంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా రూపకల్పన చేశారు అన్నారు. అటువంటి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు ప్రజలంతా అండగా ఉండాలని కోరారు ..

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు ..

Whatsapp Image 2024 01 06 At 9.53.03 Am

SAKSHITHA NEWS